విజయవాడ

పాతర! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా బాల్యంలో మా పల్లెలో
కల్మష రహిత రైతన్నల ఇళ్లలో
నా శ్రవణపు లోగిళ్లలో సందడి చేసిన
ఓ అందమైన పదరాజం.. ‘పాతర’!
ధాన్యపు రాసులతో నిండిపోయి
కళకళలాడుతుండేది పాతర
దాని వీక్షణలో నాడెందమానంద
డోలికల్లో విహరించేది
నేడుకూడా నా శ్రవణ శక్తికి
పరీక్షగా వినిపిస్తోంది పాతర!
ఉన్మాదుల వికృత చేష్టలతో
నైతిక విలువల పాతర..
కులాల కార్పణ్యాలతో
సామాజిక విలువల పాతర..
మతాల ఉన్మత్తంతో
సాంఘిక విలువలకు పాతర..
దుర్వ్యసనాల దుశ్శాసనులతో
వావివరుసలకు పాతర..
స్వార్థపూరిత ఆలోచనలతో
సమాజాభ్యుదయానికి పాతర..
కార్పొరేట్ ఆగడాల నిత్యక్రీడలో
బీదా బిక్కీ బతుకులకు పాతర..
లజ్జారహిత అవినీతి ఊబిలో
నీతి నియమాలకు పాతర..
నోట్లే ఓట్లుగా మారుతున్న కాలంలో
రాజకీయ విలువలకు పాతర
పాతర పదం ఇలా బహుముఖీనమై
నా కర్ణేంద్రియాల్ని బద్దలు చేస్తోంది
నాటి పాతర చూడగానే
నా నయనాలు చెమర్చేవి
నేటి పాతరల గురించి వినగానే
అశ్రుధారలు కురుస్తున్నాయి
కాలమా! ఎంత మార్పును
చూపించావు
ఎంత నిర్దయగా విలువల్ని
తారుమారు చేసేశావు!
‘పాతరే’సేశావు!!
- మద్ది పుల్లారావు
నందిగామ, కృష్ణా జిల్లా.
చరవాణి : 9951287113

వాడు మారడు

వాడెప్పుడో చిన్నప్పుడు కనిపించాడు
మళ్లీ అదేదో ఫంక్షన్లో కనిపించాడు
క్లాస్‌మేటని పేరే గాని
చదువు పూర్తయ్యాక
కనిపించనేలేదు
జీవితాల్లోకి పేజరొచ్చింది
అయినా సందేశాల్లేవు
మొబైల్ ఫోనొచ్చింది
అయినా మాటల్లేవు
ఫేసు బుక్కొచ్చింది కానీ
వాడి ఫేసు కనబడదు
ట్విట్టరొచ్చింది
వాడు తప్ప ప్రపంచమంతా
ఏం చేస్తుందో చెప్తాడు
ఇన్సుటా గ్రామొచ్చింది
పిల్లల ఫొటోలు పెడతాడు గాని
వాడి ఫొటో పెట్టడు
సామాజిక మాధ్యమాలెన్నున్నా
వాడంతే..
వాడు మారడు
ఇవన్నీ లేనప్పుడే నయం
గలగలా మాట్లాడేవాడు
- గగనం శ్రీనుకుమార్,
సెల్ : 8008262514

కవితా ప్రేయసి!

కదిలే కాలాన్ని
నీ కాటుక కళ్లతో కట్టేశావు
వీచే గాలిని
నీ సూదంటు చూపులతో
చుట్టేశావు
విరిసే చిరునవ్వుల గులాబీలను
నీ అధరాల్లో పూయించావు
రాయంచ నడకలతో
నీ నవయవ్వన లోకానికి
స్వాగతించావు
ఆశల ఆకాశంలో
నీ మేఘాల మోహాలతో
కబురందించావు
నిరాశా నిస్పృహలు కమ్మినప్పుడు
నీ పిలుపు వెలుగులతో
దరిచేర్చావు
ఓటమి గాయాలతో
నిశీధిలో దుఃఖితుడైనపుడు
నీ ఆత్మీయ స్పర్శతో
మేలుకొల్పావు
ఆశలన్నీ ఆవిరైనపుడు
నీ ఆలంబనతో
నా జీవన గమ్యాన్ని చేర్చావు
కోకిలమ్మ స్వరంలో
నీ వలపుల వసంతగీతమై
ఆలపించావు
ఇంతకీ ఆ అందాల రాశి
ఎవ్వరో తెలుసా?
నా ఊహల ఊర్వశి
నా కవితా ప్రేయసి!
- బత్తుల బ్రహ్మయ్య,
జగ్యయ్యపేట, కృష్ణా జిల్లా.
చరవాణి : 8885351472

ప్రేమా! ఏదీ.. నీ చిరునామా!

ఈ ప్రపంచంలో
ప్రేమలేని వారెవ్వరు
మనిషై పుట్టినవారికే కాదు
మాయామర్మాలు తెలవని
పశుపక్ష్యాదులకు సైతం
ప్రేమలున్నాయి.. ప్రేరణలున్నాయి

పాశ్చాత్య పోకడలతో
పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే
ప్రేమలన్నీ వెలవెలబోతున్నాయి
వెక్కిరింపులకు గురవుతున్నాయి

ముందుగా..
నిన్ను నీవు ప్రేమించుకొని
నిన్ను నీవు ఉన్నతీకరించుకొని
నిన్ను నీవు మనిషిగా పూర్ణించుకొని
నీలో నిలువెల్లా
ప్రేమంటూ ఏమైనా వుంటే
కొంచెం కొంచెంగానైనా
పది మందికి పంచు!
క్షణం క్షణం ద్వేషాల్ని
రగిలించుకొని
మరణం వైపు
పయనించటమెందుకు?
ప్రేమను పంచకపోయినా
ద్వేషాన్ని చిమ్మటమెందుకు..
కుత్సితాలను కుతంత్రాలను
మనసు పొరల్లో మరిగించి
కలుషితమైపోతున్న దేహంతో
ఆపద్ధర్మ ఆలింగనాలెందుకు?
సముద్రమై ప్రవహించే వాడికి
ఆటుపోటుల్లోనూ
ప్రేమ ఆణిముత్యమే!

ప్రేమకాని ప్రేమలకు
ప్రేమ పేరు పెట్టటమెందుకు?
ఉన్మాదపు చర్యలను
ఈ చెలిమికి చుట్టటమెందుకు?
ప్రేమ చిరునామాలను
చరిత్రలో చెరపడమెందుకు?
స్వార్థం లేని ప్రేమల్ని
నీ హృదయ సౌధంలో
పచ్చని మొక్కలై మొలవనీ..
వెనె్నలై స్రవిస్తున్న
మమకార బిందువుల్ని
నీ అంతరంగ ఆకాశంలో
వెచ్చని చుక్కలై వెలగనీ..!
- కటుకోఝ్వల రమేష్,
ఇల్లందు
చరవాణి : 9949083327

నానీలు

అమ్మ వుంటే
నరకమైనా పండగ
ఆమె లేని స్వర్గం
వట్టి దండగ

అంత దూరమా..?
ఆకాశం
ప్రయత్నించి చూద్దాం
కాకపోదు పాదాక్రాంతం

ఆడవాళ్లు
పికాసో చిత్రం లాంటివాళ్లు
అర్థంకారు
అందంగా ఉంటారు

భయపడకు
లోకం అంతే
నేనూ ఉన్నానని
గుర్తుచేస్తుందెప్పుడన్నా

మానసిక రుగ్మతేమో
మాట కంపు కొడుతుంది
అతడు
పై అధికారి!
- బంగార్రాజు కంఠ,
విజయవాడ.
చరవాణి: 8500350464