విశాఖపట్నం

వైవిధ్యభరితం అఖిలాశ (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవి జాని తక్కెడశిల మనసులో తనెలా అనుకుంటే అలా పదాల అమరికతో కవితలల్లారనే చెప్పాలి. ఎందుకంటే ఏభై ఒక్క కవితల కదంబమాల అంటే రంగు రంగుల పుష్పాల మాలనే కదంబ మాటల అంటారు. అలాగే రకరకాల కవితా వస్తువులతో అల్లిన కదంబ కవితా సంపుటి ఈ అఖిలాశ.
‘పెళ్లికూతురు’ కవితలో పెళ్లి వేడుకను కళ్లకు కట్టారు. ‘మాంగల్యం’ కవితలో పవిత్రత గురించి చెప్పారు. ‘హాయి హాయి’ కవితలో వెనె్నల్లో ప్రియురాలి పలుకులుండగా సంగీతాన్ని తోసిరాజన్నారు.
నా సిరి బొమ్మ, ఓ అఖిల నిఖిలం, ఏమైందీ వేళ, ఓ ప్రియా జీవప్రేమ, ప్రేమకు ఆనవాళ్లు, నీవేలే, మందార అఖిలాశ, ఓ ప్రియసఖీ ఇలా కవితలు మొత్తం ప్రియురాలి ప్రేమ, పరువం, వలపు, విరహం, పొగడ్తలు, అందాలు ఇవే వస్తువుగా తీసుకుని కవి హృదిలోని ప్రేమను తెలిపి పాఠకులని శ్రావణ మేఘపు ఝురుల్లో తడిపారు.
ఓ కవితలో జలం గొప్పదనాన్ని చెబుతూ వృథా చేయొద్దని సందేశమిస్తారు. మరో కవితలో గురువుని పూజిస్తారు. మరో కవితలో స్నేహితుడిని కవితా వస్తువు చేసి నిలబడెతారు. జ్ఞానం కవితలో సూక్తుల ద్వారా జ్ఞానబోధ చేస్తారు. మన చేతిలో రూపాయి ఎన్ని ఆటలు ఆడిస్తుందో, ఆడుతుందో చక్కగా వివరించారు ‘రూపాయి’ అనే కవితలో.
గండం అనే కవితలో వావి వరసలు మరిచి పసి పిల్లలను చెరిచే కామాంధుడి గురించి, యాసిడ్ దాడులు, నట్టింట నరకం చూపించే కసాయి భర్త వంటి వారిని శిక్షించాలంటూ నినదించారు.
భగవంతుడా ఓ నీలకంఠా నాకు తెలుసు ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదని అని ఏది శాశ్వతం కవితలో చెబుతారు. ఒక మనిషి జీవనయానం ‘జీవనసూక్తి’ కవితలో అతి సరళంగా వివరించారు. మంచి పనులు చేసి పంచ ప్రాణాలను స్వర్గానికి పంపు అంటూ చెప్పారు.
సమస్య కవితలో సమస్యను సడలించి సమాప్తం చేస్తేనే విజయం సాధించగలమని తెలిపారు. ‘ ఓ వీర సైనికా’ కవితలో సైనికుల వీరత్వం పెంచుతూ కర్తవ్య దీక్షను బోధిస్తారు.
అజ్ఞాతశక్తి కవితలో తన అదృష్టశక్తిని ఎంత వరకు నమ్మాలో ఆలోచించుకోమంటారు. మాయగాళ్లను నమ్మి జీవితం నాశనం చేసుకోవద్దు అని హెచ్చరిస్తారు.
తెలుగు గొప్పదనాన్ని ‘తెలుగోడా వినవయ్యా’ అనే కవితలో తెలిపారు. విమర్శలు కూడా ప్రశంసలుగా భావిం వారి చేతనే మెప్పు పొందాలి అని చక్కటి భావాన్ని ప్రకటించారు ‘ప్రశంస విమర్శ’ కవితలో.
సంక్రాంతి కవిత పండగను తెలుపుతూ పూజించాల్సిన పశువులను హతమార్చే పండగగా మారిందని చెబుతారు.
చివరిగా జానీ బాషా తక్కెడ శిల సమాధి కవితలో మనిషి చివరి గమ్యస్థానాన్ని గుర్తు చేశారు. అంటే ఈ ప్రపంచంలో కవి హృదయం ఉండాలే గానీ కాదేదీ కవితకనర్హం అని చెప్పకనే చెప్పారు.
మొదటి విడతలోనే ఇంత చురుగ్గా పిట్ట కొంచెం కూత ఘనం అనిపించుకున్న కవిత తన జీవితంలో సాహిత్య రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంటారనడం అతిశయోక్తి కాదు.

- పుష్ప గుర్రాల, విజయనగరం. సెల్ : 9491762638.