ఐడియా

గ్రీన్ టీతో పంటి సమస్యలు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంటి నొప్పితో బాధపడేవారు గ్రీన్ టీని అలవాటు చేసుకోమని వైద్య నిపుణు లు చెబుతున్నారు. టీ తాగే అలవాటు మానుకోలేరు. పంచదార కలిపిన టీ తాగ టం వల్ల పంటి నొప్పితో బాధపడేవారికి మరింత నొప్పి కలుగుతుంది. కాబట్టి ఇటువంటివారు ఉదయమే గ్రీన్ టీ తాగితే మంచిదని అంటున్నారు. రోజుకు రెండు మూడుసార్లు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి కూడా మంచిదని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ వల్ల అనేక అనారోగ్య సమస్య లు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలున్నాయని అంటున్నారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపోడుకోవచ్చు. రకరకాల వనమూలికలు కలిపి ఉంటాయి. దీనిని సేవించడం వల్ల శరీరంలో ఉన్న ఎన్నో రుగ్మతలు దూరవౌతాయంటున్నారు వైద్యులు. మొక్కల ఆకులు, వేళ్లు, పళ్లు, పూవులు, కాయలు ఇతర చెట్టు భాగాలు హెర్బల్ టీ తయారీలో ఉపయోగిస్తారు. దీంతో దీనిని సేవించటం వల్ల హృదయం పదిలంగా ఉంటుంది. గుండెపోటును నిరోధిస్తుంది. జీర్ణక్రియలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఇది శరీరంలో ఉన్న మలినాలను విసర్జించేలా చేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అలాగే టీలో పంచదార కలుపుకోవటం వల్ల పళ్లకు హాని కలుగుతుంది. గ్రీన్ టీ సేవించటం వల్ల జ్ఞాన దంతాలతో పాటు ఇరవై దంతాలు సురక్షితంగా ఉన్నాయని న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ప్రతి రోజూ గ్రీన్ టీ సేవిస్తుంటే జీవితంలో పంటి వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరమే ఏర్పడదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. దంతాలు పాడవుకండా పంటి నొప్పులకు చెక్ పెట్టవచ్చని వీరు అంటున్నారు.