ఫోకస్

చట్టాలను అతిక్రమించరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర, రాష్ట్రాలు గోరక్షణకు తెచ్చిన చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. అదే సమయంలో గోరక్షకులు తమ పరిధికి లోబడి వ్యవహరించాలి. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంచి సందేశం ఇచ్చారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ హింసకు తావులేదు. గోరక్షణ పేరిట గోసేవకులు ఇతరులపై దాడులకు పాల్పడరాదు. చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోరాదు. దీనివల్ల భారత్‌కు ప్రపంచ దేశాల్లో చెడ్డపేరు వస్తుంది. అదే సమయంలో గోవులను అక్రమ రవాణా చేయడం, గోవులను వధించేవారు ప్రజల మనోభావాలను గౌరవించాలి. ఇటీవల కాలంలో చాలాచోట్ల గోవులను వధించడం, దీన్ని చూసి గోరక్షకులు ఆగ్రహానికి గురికావడం, ఈ నేపథ్యంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోరక్షణకు మండల స్ధాయినుంచి జాతీయ స్ధాయి వరకు పెద్దఎత్తున ప్రచారం, ఉద్యమం చేపట్టాలి. అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలి. సమాజంలో రాజకీయాలకు అతీతంగా స్వచ్చంద సేవా సంఘాలు ఏకమై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. గోవులను వధించడంవల్ల పడే శిక్షలు, దానివల్ల చేకూరే నష్టాలను వివరించాలి. మహోద్యమంగా తీసుకెళితే తప్పకుండా మంచి ప్రయోజనాలు వస్తాయి. బీఫ్ ఫెస్టివల్స్ పేరిట కొంతమంది వేడుకలను నిర్వహించడం దారుణం. ఈ తరహా ఘటనలు సమాజంలో అశాంతిని ప్రేరేపిస్తాయి. ఘర్షణకు దారితీస్తాయి. మత సామరస్యానికి నిలయం భారత్. భిన్న సంస్కృతులతో భారత్ మేళవిస్తుంటుంది. ప్రజల సెంటిమెంట్లను అందరూ గౌరవించాలి. లేనిపక్షంలో విపరీతమైన పరిణామాలకు దారితీస్తుంది. రాజ్యాంగ నిబంధనలు, చట్టాలను ఎవరు ఉల్లంఘించినా తప్పే. గోవుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వీటి నిర్వహణకు నిధులిఇవ్వాలి. గోవువల్ల వచ్చే లాభాలను అన్ని వర్గాలకు వివరించాలి.

- కె శివకుమార్, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ శాఖ