ఫోకస్

అమాయకులపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత గోరక్షక దళాల పేరిట మనుషులపై దాడులు పెరిగిపోయాయి. ఇది దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. గోవును ప్రతి ఒక్కరూ ఆరాధిస్తారు. ఇందులో అనుమానం లేదు, కానీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్ వంటి సంస్థలు గోరక్షణ పేరిట దాడులు చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. కేంద్రం కాషాయ భావజాలాన్ని వెయ్యి పడగల విశ్వనాగు వలే విజృంభిస్తున్నది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వంటి శక్తులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయికరణ చేయాలన్న పగటి కలలు కంటున్నాయి. ఎక్కడైనా గోవులు అనారోగ్యంవల్ల లేదా మరేదైనా కారణం చేతనైనా మరణిస్తే, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి శక్తులు గోరక్షణ దళాల పేరిట మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఇక బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ అరాచకాలకు హద్దే లేదు. ధాత్రి ఘటన వంటి ఘటనలు ఎనె్నన్నో జరుగుతున్నాయి. తప్పుడు భావజాలం అని ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ప్రకటించడం లేదు? సాటి మనిషిని మనిషిగా గుర్తించని, గౌరవించలేని సమాజాన్ని నిర్మించే దిశగా ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ నడుస్తున్నది. నకిలీ గోరక్షణ దళాలు ఎక్కడినుంచి పుట్టుకుని వస్తున్నాయి. వీటికి సమాధానం ఎవరు చెబుతారు? గోరక్షణ దళాల పేరిట గోభక్షక దళారుల వచ్చారా? వారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. గోవుల రక్షణ పేరిట అమాయకులైన ప్రజలపై ముఖ్యంగా దళితులపై, ముస్లిం-మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. కేంద్రంలో యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు పెద్దగా ఉత్పన్నం కాలేదు. ఎక్కడో ఒకటో, అరో ఉత్పన్నమైతే సంబంధిత అధికారులు వెంటనే చర్య తీసుకునేవారు. ఇటువంటి సున్నితమైన అంశాలకు రాజకీయ రంగు పులుమరాదు. గోవులను, ఇతర పశువులనూ కాపాడాలి. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. కానీ గోరక్షణ దళాల పేరిట ఇతరులపై దాడులు చేయడమే అమానుషం. కాబట్టి ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.

కొనగాల మహేష్ అధికార ప్రతినిధి, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ