ఫోకస్

దాడులు చట్టవిరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. మన రాజ్యాంగం మనకు అనేక చట్టాలను కల్పించింది. ఎవరు ఎలా ప్రవర్తించినా చట్టానికి లోబడే ఉండాలి తప్ప, చట్టవ్యతిరేకంగా వ్యవహరించకూడదు. గోసంరక్షణ చేసే వారిపై దాడి చేయడం సముచితం కాదు. అలాగే గోమాంసం తినేవారిపై, గోవులను రవాణా చేసేవారిపై దాడులు చేయడం చట్టవిరుద్ధమే అవుతుంది. ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్ తదితర సంస్థలు ఆవులను అడ్డుపెట్టుకుని శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం కల్గిస్తున్నాయి. గోవులకు సంబంధించి ఎవరు ఎవరిపై దాడులకు పాల్పడ్డా అది చట్టరీత్యా నేరమే అవుతుంది. 2014 సాధారణ ఎన్నికల్లో బిజెపి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోయింది. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, హిందూత్వ అజండా చేపట్టింది. స్విస్ బ్యాంకులో భారత్‌కు చెందిన కుబేరుల డబ్బు దాదాపు 13.50 లక్షల కోట్ల రూపాయలను తీసుకువస్తామని, ప్రజావసరాలకు వినియోగిస్తామని విస్తృతంగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక కుబేరులకే వత్తాసు పలుకుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గోసంరక్షణకోసం ప్రత్యేక చట్టం చేసింది. గోవుల రక్షణ మంచిదే. ఆవులు, ఎద్దులు వ్యవసాయంలో కీలకమైనవనడంలో సందేహం లేదు. ఆవుదూడలను గృహప్రవేశ సమయాల్లో హిందువులు పూజిస్తారు, కొత్త ఇంటిలో ఆవుదూడలను తిప్పుతారు. ఆవులను, ఎద్దులను ఎవరూ చంపాలనుకోరు. వయస్సుపైబడ్డ తర్వాత వాటిని పోషించలేని పరిస్థితిలో కబేళాలకు రైతులు అమ్మివేస్తారు. మేక, గొర్రెలు తినడం లేదా? అలాగే ఆవు, ఎద్దులను కూడా తింటున్నారు. పేదలు పోషకాహారంకోసం ఈ మాంసం తింటున్నారు. వేలాదిమంది ఈ వ్యాపారంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవిస్తున్నారు. బిజెపి కేవలం ఓటు బ్యాంకుకోసం గోవధ నిషేధ చట్టాన్ని చేసింది.

- డాక్టర్ కె. నారాయణ, సిపిఐ జాతీయ నాయకుడు.