ఫోకస్

రక్షకుల ముసుగులో నరహంతకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గావో విశ్వస్య మాతరమ్ అనేది వేదోక్తి. పంచ మాత్రికల్లో ఒకటియైన గోమాతను పూజించడం, పోషించడం, రక్షించడం మనందరి కనీస కర్తవ్యం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి మాన బిందువుల్లో ఒకటైన గోమాతను వధించకూడదని దేశవ్యాప్తంగా సామాన్య మానవుడినుంచి పూజ్య స్వామీజీల వరకు అనేకమంది ఎన్నో ఉద్యమాలు చేశారు. గోరక్షకుల ముసుగులో తీవ్రవాదులు, ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు తమ తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి హిందూ జాతీయవాదుల్లో చీలికలు తేవడానికి వేర్పాటువాద శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గోరక్షణ ముసుగులో మనుషులను చంపడమే వారి అనైతిక, హేయమైన చర్యలకు పరాకాష్ట. ఈ సమయంలో నిజమైన గోరక్షకులు సంయమనం పాటిస్తూ జరిగిన విషయాలపట్ల అవగాహన పెంచుకుంటూ గోరక్షణలో కొనసాగించాల్సిన అవసరం ఉంది. జార్ఖండ్ మరియు ఈశాన్య ప్రాంతాల్లో గోమాంస భక్షణ సహజం కావచ్చునేమో కానీ, దానిని దేశం మొత్తం మీద రుద్దాలనుకోవడం నయవంచక లౌకికవాదుల దురాగతానికి ప్రతీక. ఈ దేశంలో నివశించే వారందరూ ఈ దేశం యొక్క మానబిందువులను గౌరవించాలి. మైనార్టీ వర్గాల బుజ్జిగింపు ధోరణిని రాజకీయ నాయకులు ఎంత తగ్గించుకుంటే అంత మందిది. భారతదేశం వైభవ స్థితి గోవు, గంగా, గీత, మొదలైన వాటి రక్షణతోనే ఇమిడి ఉంటుంది. గోరక్షకుల ముసుగులో నరహంతకులు పేట్రేగిపోకుండా అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. నిజమైన గోరక్షకులెవరు, నకిలీ గోరక్షకులెవరు అనేది నిగ్గుడేల్చాలి. ఈ పనిని వేగవంతంగా చేయాలని నిజమైన గోరక్షకులందరూ కోరుకుంటున్నారు.

- సదాశివ సామాజిక సమరసత వేదిక జాతీయ కార్యవర్గ సభ్యులు