ఫోకస్

దాడుల వెనుక స్వార్థపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోసంరక్షణ పేరుతో దాడులకు పాల్పడటం అనైతిక చర్య. ప్రజలపై దాడిచేయడం అంటే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకున్నట్టే. ప్రజలకు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో గోసంరక్షణ జరగాలి. గోవధకు చట్టం తీసుకురావడం సంతోషకరమే.. కానీ గోవధలో షరతులు, చట్టాల లొసుగులు వాటిని కాపాడలేవు. గోవధ, గోసంరక్షణపై ప్రజా ఉద్యమం రావాలి. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమష్టిగా కృషి చేస్తేనే అది సఫలమవుతుంది. కానీ గోసంరక్షణ ఒక వర్గం స్వార్థం కోసమో.. వ్యక్తుల ఆధిపత్యం కోసమో కాకూడదు. ప్రస్తుతం సమాజంలో ఉద్యమాలన్నీ స్వార్థపూరితమయ్యాయి. ఎవరైనా ఒక ఉద్యమం లేవనెత్తుతున్నారంటే.. దానివెనుక స్వార్థం స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటిది జరగకూడదు. గోసంరక్షణ ముసుగులో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రజలపై భౌతిక దాడులు జరుగడం దురదృష్టకరం. గోవధ, గోసంరక్షణపై ప్రజలను మెప్పించాలి. ఎలాంటి దాడులకు పాల్పడకుండా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తీసుకొని ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రావాలి. ప్రజాస్వామ్యంలో దాడులు అంటే నేరమే. చట్టాలను తమ చేతుల్లో తీసుకోకుండా శాంతియుతంగా, హింసకు తావులేకుండా ఉమ్మడి కృషి, శ్రమతో సాధించుకోవాలి. గోసంరక్షణ అంటే అందరూ ముందుకు వస్తారు.. కానీ దాడులు అంటే ముందుకు వచ్చేవారు అతికొద్దిమంది మాత్రమే. చట్టాన్ని అతిక్రమించి దాడులకు పూనుకుంటే చట్టపరంగా చర్యలు తప్పవు. గోసంరక్షణ ఉద్యమం నీరుగారక తప్పదు. దాడులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయి. కాబట్టి ప్రజలపై దాడులు మానుకోవాలి. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకోవాలి.

-పేర్వారం రాములు, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్