ఫోకస్

కబేళాలకు తరలిస్తే కేసులు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవులను కబేళాలకు తరలించేవారిపై కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలి. జాతీయ రహదారుల్లో అనునిత్యం గోవులను వాహనాలలో అత్యంత కిరాతంగా బంధించి కబేళాలకు తరలిస్తున్నారు. ఒక వాహనంపై ఓ రైతు నాలుగైదు గోవులను మాత్రమే, అదికూడా వ్యవసాయ పనుల నిమిత్తం తరలించే అవకాశం ఉంది. అలాకాకుండా అతి కిరాతకంగా ఒక వాహనంపై అనేక గోవులను బంధించి, అక్రమ మార్గంలో కబేళాలకు తరలిస్తున్నారు. వాళ్ళు పెట్టే చిత్రహింసలను భరించలేక మార్గం మధ్యలోనే గోవులు ప్రాణాలు వదిలే దురదృష్టకర పరిస్థితులున్నాయి. ఈ విధంగా అక్రమంగా గోవులను తరలించేవారిపై ప్రభుత్వ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. గోవుల రవాణా వ్యవహారంలో వాస్తవాల ఆధారంగా కేసులు నమోదు చేయాలి. ప్రభుత్వం దృష్టి మరల్చి గోవులను కబేళాలకు తరలించేవారిపై కేసులు నమోదు చేయడం లేదు. దీనిపై తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేశాం. గోసంరక్షణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టం చేసింది. హిందువులు గోమాతను తల్లిగా పూజిస్తారు. గోవు రూపంలో ఉన్న హిందూత్వాన్ని కొందరు చంపేస్తున్నారు. దేశంలో ఆవు సంతతిని పరిరక్షించేందుకు చేసిన చట్టాన్ని గౌరవించి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలి. అలాగే గోసంరక్షకులపై జరుగుతున్న దాడులను ప్రతి హిందువు తిప్పికొట్టాలి. గోవులను రక్షించేవారిపై దాడులు జరిగితే అంతకంటే దురదృష్టకర సంఘటన మరొకటి లేదు. కొందరు హిందువులే గోవులను గోవధశాలకు పంపుతున్న దురదృష్టకర పరిస్థితులను గమనించాం. ఇది హేయమైన చర్య. ఈ నీచ సంస్కృతికి చరమగీతం పాడుతాం. గోవును చంపితే కన్నతల్లికి హాని తలపెట్టినట్టేనన్న వాస్తవాన్ని గ్రహించాలి.

-యెనిమిరెడ్డి మాలకొండయ్య బిజెపి జిల్లా అధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా