ఫోకస్

గోరక్షణ శాంతియుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరక్షణ అనేది శాంతియుతమైన ఉద్యమంగా సాగాలి కానీ హింస పనికి రాదు. రాజ్యాగంలోనే గోవధ నిషేధం ఉంది. దీని ఆధారంగా కొన్ని రాష్ట్రాలు గోవధను నిషేధిస్తూ చట్టాలు చేశాయి కానీ రూల్స్ రూపొందించలేదు, చిత్తశుద్ధితో అమలు చేయలేదు. కేవలం కాగితాలకే ఆ చట్టాలు పరిమితం అయ్యాయి. చట్టాలు చేసిన రాష్ట్రాల్లో గోవులను కబేళాలకు తరలించేప్పుడు గోరక్షకులు అడ్డుకుని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లిప్పుడు ఏదో కేసు పెట్టి వదిలేయడం మినహా చట్టాన్ని అమలు చేయాలనే ధ్యాస పాలకులకు లేదు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత గోరక్షకులు చట్టంలో ఉన్న విధంగా గోవుల వధను అడ్డుకుంటే కొన్నిచోట్ల వివాదం తలెత్తుతోంది. ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చాక గోరక్షకులు సంఘటితమై అక్రమంగా గోవులను తరలిస్తుంటే అడ్డుకుంటున్నారు. గోవధ నిషేధం చట్టమే ఉన్నప్పుడు గోరక్ష దళాలు ఆ పని ఎందుకు చేస్తున్నాయి అని ఆలోచించాలి. ప్రభుత్వం చట్టాలను అమలు చేయక పోవడంవల్లనే గోరక్ష దళాలు ఆ పని చేయాల్సి వస్తోంది. కమ్యూనిస్టు భావజాలంతో ఎన్నో సంస్థలను ఏర్పాటు చేశారు. మానవ హక్కుల సంఘం, బాలల హక్కుల సంఘం అంటూ ఎన్నో సంఘాలున్నాయి. మానవ హక్కులను ప్రభుత్వం సరిగా అమలు చేయలేకపోతోందనే కదా ఈ సంఘాలను ఏర్పాటు చేసింది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని వీరు ఆందోళన చేస్తారు. చట్టాన్ని అమలుచేయాలి అనేదే వీరి ఆందోళన. అదే విధంగా గోరక్షణ చట్టం అమలు చేయాలి అనేదే గోరక్షకుల ఉద్యమం. కమ్యూనిస్టులు చట్టం అమలుకోసం డిమాండ్ చేసినట్టుగానే గోరక్ష దళాలు డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే గోరక్షణ అనేది శాంతియుతంగా సాగాలి. ఘర్షణ వైఖరి, దాడులు చేయరాదు. గోవులను రక్షించాలి అనుకునే వారైనా, గోవులను తరలిస్తున్నవారు ఎవరూ హింసకు పాల్పడరాదు. గోరక్షకులు దాడులు జరుపుతున్నట్టు, గోరక్షకులపై దాడులు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఘర్షణ వైఖరి మంచిది కాదు. ప్రధానమంత్రి కూడా ఇటీవల ఇదే విషయం చెప్పారు. శాంతియుత సహ జీవనం ద్వారానే గోరక్షణకు నడుం బిగించాలి. అదే సమయంలో చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గోవులను తరలిస్తున్నారనే సమాచారం ఉన్నప్పుడు పోలీసుల దృష్టికి తీసుకురావాలి. చట్ట ప్రకారం చర్య తీసుకునే విధంగా ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలి.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి, ప్రజ్ఞ్భారతి