ఫోకస్

చట్టం రక్షణ ఉన్నపుడు దాడులు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య దేశంలో చట్టానికి, రాజ్యాంగానికి విలువ వుంది. ఈ చట్టాలను, రాజ్యాంగాలను ఎవరూ ఉల్లంఘించరాదు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. రాజ్యాంగంలోనే గోవులను సంరక్షించాలనే క్లాజ్ వుంది. పేరెంటివ్ ప్రిన్సిపల్స్ వున్నాయి. వివిధ దేశాల్లో కూడా గోరక్షణకు చట్టాలు వున్నాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా గోరక్షణకు చట్టం చేసింది. చట్ట పరిధిలో గోసంరక్షణకు తగిన చర్యలు చేపట్టేందుకు అవసరమైన వ్యవస్థ వుంది. ఎక్కడైనా గోవులకు ప్రమాదం సంభవించిందని తెలిస్తే ఫిర్యాదు చేసినపుడు సంబంధిత అధికారులు పట్టించుకోకపోయినా, పోలీసులు పట్టించుకోకపోయినా ప్రైవేటు క్రిమినల్ కేసులు కూడా పెట్టే విధంగా కోర్టులను కూడా ఆశ్రయించే అవకాశం వుంది. ఇటువంటి చట్ట సంరక్షణ వదిలేసి కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షనిస్టుల మాదిరిగా దాడులకు తెగబడ్డం సరికాదు. హిందూయిజాన్ని సంరక్షిస్తున్నామని చెప్పి గోవులపై దాడులకు సంబంధించి ప్రతి దాడులు చేయడం ఆటవికమే అవుతుంది. ప్రధాని మోదీ గోరక్షణకు సంస్కరణలు తెచ్చారు. అంతా మంచిగానే 99 శాతం మేలు చేస్తే ఒక శాతం కీడువల్ల మొత్తం అందరికీ చెడ్డపేరు వస్తుంది. చట్టాన్ని చేసిన మోదీకే చెడ్డపేరు వచ్చే ప్రమాదం వుంది. కడివెడు పాలు అమృతంగా వున్నప్పటికీ నలక మాత్రమే కన్పిస్తుంది. దాడులువల్ల మోదీ ప్రభుత్వానికి అపకారమే అవుతుంది. ఇటువంటి చర్యలువల్ల మొత్తం వ్యవస్థకే నష్టం. హిందూయిజానికి గొప్ప చేస్తున్నామని చెప్పి నష్టం చేస్తున్నవారమవుతాం.. ఇటువంటి దాడులు జరగడం వల్ల మోదీ ఉదాసీనత వల్లే బరితెగిస్తున్నారని అపవాదు మూటగట్టుకున్నట్టుగా, విమర్శలకు అవకాశం ఇచ్చేదిగా మారుతుంది. గోరక్షణ పేరుతో అకతాయిల చర్యలు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. అప్రమత్తంగా వుండాలి. సంఘ పరివారానికి ఒకప్పటి మచ్చవల్ల ఇప్పటికీ కష్టంగానే వుంది. గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్ అంటూ ఆర్‌ఎస్‌ఎస్ అంతా గాడ్సేలే అంటూ నిందలు వేస్తున్నారు. కొంత మంది తుంటరి చర్యలవల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. మనిషిలో మూడు రకాలు వుంటారు. సత్వగుణం కలిగిన వారు మేధస్సుతో ఆలోచిస్తారు. రజో గుణం కలిగిన వారు ఉద్రేకంతో వ్యవహరిస్తారు. తమో గుణం కలిగిన వారు సాత్వికంగా వుంటారు. గోరక్షణ చేస్తున్నామని చెప్పేవారు రజోగుణం వల్ల అసలు గోరక్షణకు హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారు. మోదీ దన్ను చూసుకునే దాడులు చేస్తున్నారని తస్మదీయులు ఆరోపిస్తున్నారు.

కర్రి రామారెడ్డి ప్రఖ్యాత మానసిక వైద్యులు బిసి రాయ్ జాతీయ అవార్డు గ్రహీత