ఫోకస్

పూజించాల్సిన గోవును భుజించడమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజలందుకోవాల్సిన గోవును వధించి భుజించడం దారుణం. పురాణాలు, ఇతిహాసాలు గోవును సర్వశ్రేష్ఠమైన జీవిగా జీవిగా చూపుతున్నాయి. అటువంటి గోవును వధించడం దారుణం. సర్వమానవ మనుగడకు జీవాధారమైన ప్రాణవాయువును తీసుకుని, తిరిగి వాతావరణంలోకి అదే ప్రాణవాయువును విడిచిపెట్టే ఏకైక జీవి గోమాత. గోవు సాత్వికమైన ఆహారం భుజించి, మనిషికి పౌష్ఠికాహారాన్ని అందించే జీవి కూడా గోమాతే. అటువంటి గోవును విధించే వారిని క్షమించరాదు. హిందువులు పరమ పవిత్రంగా పూజించే గోవును సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైనా ఉంది. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీనో, మరో ధార్మిక సంస్థో చేపట్టాల్సి రావడం దురదృష్టకరం. అటువంటి పరిస్థితులు మనంతట మనం కల్పించుకున్నవే. మారుతున్న కాలంలో ఆహార అలవాట్లు మనిషిని మృగంలా మారుస్తున్నాయనడంలో సందేహం లేదు. గో సంరక్షణలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలి. అలాగే గో సంరక్షులపై దాడులు కూడా క్షమార్హం కాదు. గోమాత, గోసంరక్షణ అంశాలను పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఇది కొన్ని కుహనా లౌకికవాద రాజకీయ పార్టీ కుతంత్రం మాత్రమే. ఒక జాతి దైవంలా పూజించే జంతువును, మరో జాతి వధించి భుజించడం నాగరికత అనిపించుకోదు. ఏ కోణంలో చూసినా ఇది ఖండించాల్సిన అంశమే. గో సంరక్షణ విషయంలో బిజెపి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు స్వాగతించాల్సిందే. ఇదే సందర్భంలో కొంతమంది లౌకికవాదం ముసుగులో ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నారనే భావించాలి. పార్టీలేమైనప్పటికీ హిందు దేశంలో దైవంతో సమానంగా భావించే గోవుకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. హిందుత్వ అజెండా పేరిట గో సంరక్షణను రాజకీయ కోణంలో చూపుతూ ఓట్ల రాజకీయం చేయడం ఎంతమాత్రం తగదనే చెప్పాలి. అఖండ భారతావనిలో గోవును పూజించే మంచి ఆరోగ్య కరమైన వాతావరణం కొనసాగాలనే కోరుకుంటున్నాను.

- మామిడి నాగేశ్వర రావు, ఆర్‌ఎస్‌ఎస్ విశాఖ మహానగర ప్రముఖ్