అంతర్జాతీయం

‘డోక్లామ్’కు జి 20లో పరిష్కారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జర్మనీలోని హాంబర్గ్‌లో భేటీ తర్వాతే రెండు దేశాల మధ్య నెలకొన్న డోక్లామ్ వివాదం పరిష్కారం కావచ్చు. హాంబర్గ్‌లో ఈ నెల 7, 8 తేదీల్లో జి20 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా దేశాల అధినేతలు విడివిడిగా సమావేశమై తమ దేశాల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకోవటం ఆనవాయితీ. డోక్లామ్‌లో గత మూడు వారాల నుండి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం తెలిసిందే. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ ఏడోతేదీన హాంబర్గ్ చేరుకుంటారు. చైనా అధ్యక్షుడు బుధవారమే అక్కడికి చేరుకున్నారు. చైనా నిర్మించాలనుకుంటున్న డోక్లామ్ రోడ్డు మూలంగా తమకు ముప్పు ఏర్పడటంతోపాటు భూటాన్ భద్రత దెబ్బతింటుందని భారత్ ఆరోపిస్తుంటే, చైనా మాత్రం భారత సైన్యం దురుద్దేశంతో తమ భూభాగంలోకి వచ్చిందని ఆరోపిస్తోంది. భారత్ తమ సైనికులను బేషరతుగా ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, యుద్ధం జరిగినా జరగవచ్చని భారత్‌లో చైనా రాయబారి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ, జీ జిన్‌పింగ్ మధ్య జరిగే చర్చల్లో డోక్లామ్ అంశం చర్చకు రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో అంశానికి పరిష్కా రం దొరక్కపోతే మున్ముందు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డోక్లామ్‌లో భారత సైనికులను గెంటివేయటం ఒక్కటే మార్గమంటూ చైనా పత్రికలు ప్రభుత్వాన్ని ఉసిగొల్పుతున్నాయి. యుద్ధం జరిగితే భారతదేశానికి 1962లో జరిగినదానికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది, భారత సైన్యం పట్ల తమకు ఎలాంటి భయం లేదంటూ చైనా పత్రికల్లో వార్తలు, వ్యాసాలు వచ్చాయి. చైనా విదేశీ వ్యవహారాల శాఖ సైతం మంగళవారం భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. డోక్లామ్‌లో చైనా నిర్మిస్తున్న రోడ్డు మూలంగా తన దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదంటూ భారత్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చైనా విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. తన భూభాగంలో రోడ్డు నిర్మించుకుంటే భారత్ భద్రతకు ముప్పెలా వాటిల్లుతుందని చైనా ప్రశ్నిస్తోంది. 1890లో బ్రిటిష్ పాలకులతో కుదిరిన ఒప్పందం మేరకు డోక్లామ్ తమ భూభాగమని చైనా వాదిస్తోంది. భారత్ తనంత తానుగా సైనికులను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, దీనికి భారత దేశమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చైనా హెచ్చరిస్తోంది.