అంతర్జాతీయం

రామానుజన్ గొప్ప గణిత మేధావి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలేం, జూలై 5: భారతీయుల మేథోశక్తి సామర్థ్యాలకు ప్రముఖ గణిత శాస్తవ్రేత్త శ్రీనివాస రామానుజన్ నిదర్శనమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అంతేకాదు రెండు దేశాల మధ్య మేథోసంపత్తి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడాలని ఆయన మోదీని అభ్యర్థించారు. రామానుజన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన నెతన్యాహు ఆయన ప్రపంచంలోనే గొప్ప మేధావుల్లో ఒకరని అన్నారు. ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పని చేసిన తన బంధువు ఒకరు రామానుజన్ గొప్పతనం గురించి పదే పదే చెప్పే వారని, ఆయన మాటలే తనకు భారతీయుల మేథస్సు పట్ల గౌరవం కలిగేలా చేశాయని నెతన్యాహు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. తాను, మోదీ ఇరువురము కూడా తమ దేశ ప్రజలకు మెరుగైన భవిష్యత్తును కోరుకుంటున్నామని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు. అయితే ఇందుకు చేయాల్సింది చాలా ఉందని, రాత్రికి రాత్రి ఇది జరిగిపోదని, అయితే తాము ఇరువురమూ ఇది జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు.