అంతర్జాతీయం

అపూర్వ స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెల్ అవీవ్, జూలై 5: ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్‌లో లభించిన అసాధారణ స్వాగతం చూసి తాము ఎంతో గర్విస్తున్నామని, అమెరికా అధ్యక్షులకు సైతం ఇలాంటి స్వాగతం లభించలేదని ఇజ్రాయెల్‌లోని భారతీయ సంతతివారు అంటున్నారు. ఇజ్రాయెల్‌లో నాలుగు తెగలకు చెందిన దాదాపు 8 వేల మంది భారతీయ సంతతి యూదులున్నారు. ముంబయి ప్రాంతానికి చెందినవారు బెనె ఇజ్రాయెల్ కాగా, కేరళకు చెందిన వారిని కొచిన్స్ అని పిలుస్తారు. అలాగే కోల్‌కతా ప్రాంతానికి చెందిన వారిని బాగ్దాదీలుగా, మణిపూర్, మిజోరం ప్రాంతాలకు చెందిన వారిని మెనాషేలని పిలుస్తారు. 16ఏళ్ల వయసులో తాను భారత్‌నుంచి ఇజ్రాయెల్‌కు వలస వచ్చానని, అప్పట్లో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు లేవని తెలిసి తాను ఎంతో బాధపడ్డానని డేవిడ్ నగాని అనే బస్ డ్రైవర్ చెప్పాడు. భారత్‌లో తమని ఎంతో ప్రేమగా చూసేవారని, యూదులను అక్కడివారు ఎంతో గౌరవించే వారని, ప్రేమించేవారని తాను ఇక్కడి వాళ్లకు చెప్తూ ఉంటానని కూడా అతను అన్నాడు. యూదుల పట్ల భారతీయులకు ఎలాంటి ద్వేషమూ లేదనే విషయాన్ని జనం అర్థం చేసుకోవాలని తాను ఎప్పుడూ కోరుకునే వాడినని కూడా అతను చెప్పాడు. ప్రధాని నరేంద్ర మోదీపట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వం చూపిన గౌరవాన్ని చూసి తాను ఎంతో ముగ్ధుడినయ్యానని కూడా ఆయన అన్నాడు. తనకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఏ నాయకుడికీ ఇంతటి సాదర స్వాగతం లభించలేదని, చివరికి ఏ అమెరికా నాయకుడిని కూడా ఇజ్రాయెల్ నేతలు ఇంత ప్రేమగా ఆలింగనం చేసుకోలేదని నగాని చెప్పాడు. మిగతావాళ్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాగా, ఇజ్రాయెల్‌లోని భారతీయ సంతతివారితో మోదీ జరిపే సమావేశంలో పాలుపంచుకోవడానికి ఇక్కడి భారతీయుల్లో చాలామంది సెలవు తీసుకున్నారు కూడా. టెల్‌అవీవ్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 6 వేల మంది భారతీయ సంతతి వారు హాజరవుతారని భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో ఒక భారతీయ ప్రధానికి ఆతిథ్యం ఇవ్వాలన్న తమ కల నిజమవుతున్నందుకు తమకెంతో గర్వంగా ఉందని వారు చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా మోదీతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మూడు రోజుల పర్యటనకోసం మోదీ మంగళవారం ఇక్కడికి వచ్చినప్పటినుంచి కూడా ఇజ్రాయెల్ ప్రధాని ఆయనకు నీడలా వెన్నంటే ఉంటున్నారని చెప్పవచ్చు.