జాతీయ వార్తలు

సమగ్ర నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన మత ఘర్షణలపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో బుధవారం రాజ్‌నాథ్ మాట్లాడారు. ఫేస్‌బుక్‌లో పోస్టుచేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో మతఘర్షణలు తలెత్తాయి. హుటాహుటిన సాయుధ దళాలను జిల్లాకు తరలించి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ హోమ్ మంత్రి రాజ్‌నాథ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. గవర్నర్ త్రిపాఠి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన విడివిడిగా ఫోన్ చేసి మాట్లాడారు. పరిస్థితి చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నార్త్ 24 పరగణాల జిల్లాలో తలెత్తిన ఘర్షణలకు సంబంధించి గవర్నర్, సిఎంలు హోమ్ మంత్రికి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అలాగే విభేదాలకు స్వస్తిచెప్పి సమష్టిగా పనిచేయాలని త్రిపాఠి, మమతలకు రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. గవర్నర్ త్రిపాఠి తనను అవమానించే రీతిలో మాట్లాడారని ముఖ్యమంత్రి ఆరోపించిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతలు క్షీణించాయంటూ గవర్నర్ చేసిన నిందారోపణలు తనను ఎంతో బాధించాయని మమతా బెనర్జీ మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్‌భవన్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత గవర్నర్‌కు ఉందని స్పష్టం చేశారు. కాగా నార్త్ 24 పరగణాల జిల్లాలో మంగళవారం రాత్రి మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. తక్షణం 400 బిఎస్‌ఎఫ్ కంపెనీలను సంఘటనా స్థలానికి పంపారు. అలాగే డార్జిలింగ్‌లో పరిస్థితిపై రాజ్‌నాథ్ గవర్నర్, ముఖ్యమంత్రిని ఆరా తీసినట్టు తెలిసింది. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రంకోసం చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారానికి 21వ రోజుకు చేరుకుంది.