ఐడియా

ఉల్లాసం.. ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ప్రవర్తనకు, మాటలకు, ఆలోచనలకు ప్రధానమైంది మనసు. మనస్సును ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ.. మంచి పాజిటివ్ భావాలతో మనస్సును నింపేస్తే చాలు ఇక ఆ రోజంతా హుషారుగా ఉండే అవకాశాలు ఎక్కువ. సంతోషం సగం బలం అంటారు. మనసు సంతోషంగా ఉంటే ఆ ప్రభావం శారీరక ఆరోగ్యంపైన కూడా పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం గనుక వీటన్నిటికీ మూలస్థానమైన మనస్సును అన్నివేళలా గుర్తుంచుకోవాలి. అందరికీ ఒకే విధమైన నిద్రాసూత్రం వర్తించదు. ఒక్కోసారి ఒకే వ్యక్తికి నిద్రకు సంబంధించిన తేడాలు ఉండొచ్చు. నిద్రపోయే సమయం, సహజంగా చేసే సమయం నోట్ చేసుకోవాలి. ఇలా కనీసం ఓ వారం చేయాలి.
అపుడు రాత్రివేళ సగటు నిద్ర సమయం తెలుస్తుంది. ఆ సగటు సమయమే శరీరానికి కావాలి. శారీరక సహజ నిద్ర ప్రక్రియపట్ల అవగాహన ఉండాలి.
శరీరంలో నీటి కొరత ఏర్పడితే మూడ్ మారిపోతుంది. ఓ రెండు గంటలపాటు ఎంత నీరు తాగగలుగుతున్నామో పరిశీలించాలి. పానీయాలు ఆరోగ్యవంతమైనవి కావాలి. అలా అని అవసరమైనదానికంటే ఎక్కువ నీరు తాగితే శారీరక వ్యవస్థ నుంచి ప్రధాన లవణాలు వెలికి వెళ్లిపోయే ప్రమాదం వుంది. రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు నీరు సరైన సగటు మోతాదుగా గుర్తుపెట్టుకుని పాటించాలి. ఇక వ్యాయామం విషయాలకు వస్తే ఉదయం, సాయంత్రం అన్న సంగతిని పక్కనపెడితే చురుకైన శారీరక కదలిక మనస్సుకు, మెదడుకు ఉత్తేజాన్నిస్తుంది.
అలసటగా, చిరాగ్గా ఉంటే కొద్దిసేపు బ్రిస్క్ వాక్ చేస్తే సరిపోతుంది. లేదా సైక్లింగ్, స్విమ్మింగ్ ఏదైనా ఒక 15 నిమిషాలు చాలు. ఓ వారంపాటు 15 నిమిషాలు కేటాయించి చూస్తే ఎండార్ఫిన్లు చురుగ్గా ఉంటాయి. మరుసటి వారం మరో 5 నిమిషాలు పెంచుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది మనసును నిలకడ గా, ఏకాగ్రతగా ఉం చగలిగేది ధ్యానం. ఇది యోగా ద్వారా కానీ, భగవంతుని స్మరణవలన కాని కొన్ని నిమిషాలు అవసరం. ఇలాంటివన్నీ క్రమం తప్పకుండా పాటిస్తూంటే మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫీల్‌గుడ్ అన్న మాటకు నిర్వచనంలా ఉంటుంది.

- హిమజారమణ