జాతీయ వార్తలు

నిష్పాక్షికంగా పని చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: భారత దేశ 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఆచల్ కుమార్ జ్యోతి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారి లో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, విశ్వసనీయ రీతిలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందుకోసం ఈ గవర్నెస్ ప్రక్రియను క్రియాశీలకంగా పెంపొందిస్తామని 64ఏళ్ల ఆచల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆచల్ నాసిం జైదీ స్థానే ఈ బాధ్యతలు చేపట్టారు. 1975 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన 2015లో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 17వరకూ సిఇసిగా కొనసాగుతారు.