భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.శివయ్య, యతవాకిళ్ళ, సూర్యాపేట (తెలంగాణ)
ప్ర: మా వూళ్ళో శివాలయ నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది?
సమా: అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. సామూహికంగా గ్రామానికి సంబంధించిన అంశం. గ్రామం యొక్క వాస్తు- గ్రామస్థుల భక్తి ప్రపత్తులపైన ఆధారపడి ఉంది. ఏదైనా పుణ్యకార్యం కనుక మీ మట్టుకు మీరు శ్రద్ధగా ప్రయత్నించండి.

ఏ.పూర్ణచంద్రరావు, నాయుడుతోట (వైజాగ్)
ప్ర: సార్! నేను పడుకోగానే గదిలో వస్తువులు రెండుగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. బి.పి కాదని డాక్టర్లు చెప్పారు. భూత గ్రహ పీడగా అనుమానం. దయచేసి పరిష్కారం చెప్పండి.
సమా: మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీ శరీరం పైత్య తత్వంగా అయి ఉండాలి. లేదా తలకు ఏదైనా దెబ్బ తగిలి ఉండాలి. మరోరకమైన ఒత్తిడి అయి ఉండాలి. మాదీఫల రసాయనంలో అల్లం రసం కలిపి తీసుకోండి. మార్పు వుంటుంది. పడుకునే ముందు నాణ్యమైన హారతి కర్పూరం గట్టిగా పీల్చండి.

కె.శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ (తెలంగాణ)
ప్ర: దాంపత్యంలో విభేదాలు - భార్యా వియోగం?
సమా: మీ జాతకంలో కుజ- శుక్ర దోషాలున్నాయి. జన్మ నక్షత్ర రాశి కూటాదుల మైత్రి కూడా లేదు. దోష పరిహారానికి గల మార్గాలు పత్రికా ముఖంగా సాధ్యపడదు. వీలయితే స్థానికులే కనుక వ్యక్తిగతంగా కలవండి.

ఎమ్.రమేశ్, సికింద్రాబాద్ (పార్శీగుట్ట)
ప్ర: మా అమ్మాయి పేరు ‘నీహారిక’గా మార్చాలనుకుంటున్నాం, బాగుంటుందా?
సమా: స్ర్తిలకెప్పుడూ పేరు బేసి సంఖ్య అక్షరాలలో ఉండాలి. ‘న’ కాని, ‘్భ’ కాని ప్రారంభంలో ఉండేట్టు చేసి సంఖ్య అక్షరాలతో పేరు పెట్టండి. ఉదా- నళిని- నవీన - భవాని- భారతి వంటివి.

పంచాగ్నుల ఫణీంద్ర శర్మ, విజయవాడ (కృష్ణా)
ప్ర: గురువుగారూ - నేను మీకు ఏకలవ్య శిష్యుణ్ణి- గురుపౌర్ణిమ సందర్భంగా ప్రణామాలు- ఆశీర్వదించండి! సంస్కృత భాషలో- జ్యోతిష శాస్త్రంలో కృషి చేస్తున్నాను, రాణించగలనా?
సమా: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. గీతావాక్యం. శ్రద్ధ్భాక్తులతో ప్రయత్నించండి. శుభాశీస్సులు.

ఛిందం వెంకట సత్యనారాయణ, రాజమండ్రి (తూ.గో)
ప్ర: అయ్యా! ఇదివరలో నేను పూజలో మంచి అనుభూతులు పొందినవాణ్ణి- ఇప్పుడు ఆ స్థానంలో పొందలేకపోతున్నాను. కారణమేమిటి?
సమా: కారణం ‘మనోవిక్షేపం’. దానికి కారణం ఏకాగ్రత లోపించడం- మనస్సును ఏకాగ్రం చేయండి. దివ్యానుభూతి పొందగలరు.

కొనకంచి శివనారాయణ శర్మ, అనంతపురం (ఆంధ్ర)
ప్ర: అబ్బాయి వివాహం ఎప్పుడు?
సమా: కార్తీక - మార్గశిరాలలో అవకాశం వుంది.

బి.్భస్కర శర్మ, కట్టపొందలగూడెం - ఆంధ్ర
ప్ర: నా జీవితంలో విశేష మార్పు వస్తుందా? అన్నిటా విజయావకాశాలుంటాయా?
సమా: ‘ఉద్యోగినం పురుషము పైతి లక్ష్మీ’ ప్రయత్నశీలురు కండి! క్రియాసిద్ధిః సత్వే భవతాం నోపకరణే- మహాత్ముల సూక్తిని ఆచరణలో పెట్టండి. విజయాలు వరిస్తాయి.

కె.కె- పసలపూడి, ఆంధ్రప్రదేశ్
ప్ర: నేను రాజకీయాలలో రాణించగలనా?
సమా: సేవాభావంతో వెళ్తే రాణించగలరు. అయితే ఏదో ఆశించి వెళ్తే కొంత కాలం మాత్రం నిలువగలుగుతారు. ఏదైనా ప్రయత్నం పురుష లక్షణం- ఫలితం దైవాధీనం.

కానూరి నాగభూషణరావు, చిట్టివలస (విశాఖపట్నం)
ప్ర: నాకు ఇంట్లో చాలా సమస్యలున్నాయి. ఏదీ కలిసిరావటంలేదు. మనశ్శాంతి లేదు. నాది పుష్యమీ నక్షత్రం. పరిష్కారం?
సమా: పుష్యమీ నక్షత్రం- శని మహాదశ- సింహాచలం ‘ఆది వరాహస్వామి’ని ఆరాధ్య దైవంగా కొలవండి. మార్పు రాగలదు. శని దోషాలను వరాహ నారసింహుడు నిర్మూలించగలడు.

ఎమ్.ప్రేమసాయి, బరంపురం (ఒడిస్సా)
ప్ర: రావలసిన సొమ్ము రావటంలేదు. ఎప్పుడు రాగలదు
సమా: కష్ట నిష్ఠురములతో ఆలస్యముగా కోర్టు ద్వారా రాగలదు.

కె.సంతోష్, రామచంద్రాపురం (తూ.గో.)
ప్ర: గురువుగారూ! నేను చదువులో రాణించలేకపోతున్నాను. ఏది కలిసొస్తుంది.. ఉద్యోగమా, వ్యాపారమా?
సమా: ప్రైవేటు ఉద్యోగం

ఆర్.ఎస్.గౌతం - కుప్పం (చిత్తూరు)
ప్ర: వివాహాలస్యం..పరిష్కారం చెప్పండి.
సమా: లోగడ కొన్ని కుదిరేవిగానే ఉండేవి. మీ కారణంగానే తప్పిపోయినట్టున్నవి. షరతులు తగ్గించుకుంటే వచ్చే కార్తీక మార్గశిరాలలో కాగలదు.

వి.కామేశ్వరమ్మ, విశాఖపట్నం (ఆంధ్ర)
ప్ర: అబ్బాయిది పూర్వాషాఢ నక్షత్రం- ధనుర్రాశి.. వివాహం ఎప్పుడు?
సమా: కార్తీక మార్గశిరాలలో అనుకూలంగా వుంటుంది.

టి.మహేశ్వరి, అంకుపాలెం (ఆంధ్ర)
ప్ర: వివాహ విషయంలో ఎలా ఉంది?
సమా: ఉత్తర - వాయవ్య దిశలనుండి వచ్చును. బ - న - ల - వ - మ అక్షరములు మొదట గల పేరు.

బోధనం వెంకటశివుడు - నంద్యాల (కర్నూలు)
ప్ర: వృత్తి- టి.వి మెకానిక్- ఆర్థిక ఇబ్బందులు- ఆరోగ్యపరంగా కడుపుబ్బరం- త్రేన్పులు- పరిష్కారం చెప్పండి!
సమా: ఆర్థికంగా బాగుండాలంటే సమాజానికి మన అవసరం ఉండే విద్య కాని, వృత్తికాని సాధించాలి. ఖర్చుపైన అదుపు- లాభంపైన పొదుపు అలవాటు చేసుకోవాలి. ప్రతి చిన్నదానికీ డాక్టర్లకూ మందులకూ ఖర్చుచేయకుండా ఇంటిలోనే మామూలు వంట ఇంటిలోనే ఔషధాలున్నాయన్న విషయం అర్థం చేసుకోవాలి.

ఎస్.బసవరాజు, బరంపురం, ఒడిస్సా
ప్ర: స్థానచలనం- గృహ మార్పు ఉన్నదా?
సమా: ఆగస్ట్ - సెప్టెంబర్లలో స్థానచలన సూచనలు కలవు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
ఖ్ఘౄఔ్ఘఆ్దజఒ్ద్ఘ్ఘౄబక్ఘౄజ.ష్యౄ

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ