ఆటాపోటీ

ఊపిరి బిగబట్టి.. (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఊపిరి పీల్చుకోకుండా ఎంతసేపు ఉండవచ్చు? అర నిమిషం పూర్తవుతున్నదంటేనే ఊపిరి బిగబట్టడం కష్టమవుతూ వస్తుంది. ఒకటిరెండు నిమిషాలు అలాగే ఉండగలిగితే గొప్పే. అయితే, ఫ్రీ డైవర్లు ఊపిరి పీల్చుకోకుండా నీటిలో సుమారు పది నిమిషాల వరకూ ఉండగలరు. నిరంతర అభ్యాసంతోనే ఇది సాధ్యమవుతుంది. నీటిలో ఊపిరి బిగబట్టి ఎక్కువ సేపు గడిపిన ప్రపంచ రికార్డు స్టిగ్ సెవెరినె్సన్ పేరిట ఉంది. అతను ఏకంగా 22 నిమిషాలు నీళ్లలో ఉండిపోయాడు.

రబ్బరు శరీరం
* స్విమ్మర్లు తమ శరీరాలను రబ్బరు మాదిరి ఎటువైపైనా వంచగలరు. కాలి బొటన వేళ్లను నేలకు ఆన్చగలగడమే ఇందుకు ఉదాహరణ. ఇందులో గొప్ప ఏమిటని కొట్టివేయడానికి వీల్లేదు. వెల్లకిల పడుకొని, పాదాలను వెనక్కు వంచడం ద్వారా బొటన వేళ్లను నేలకు ఆన్చడం ఎంత కష్టమో ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. ఈతకు అనువుగా, ప్రత్యేకించి కాలితో నీటిని బలంగా కొట్టడం ద్వారా వేగాన్ని అందుకోవడానికి వీలుగా ప్రొఫెషనల్ స్విమ్మర్లు విధిగా దీనిని ప్రాక్టీస్ చేస్తారు. మనలాంటి వారు ఈ ప్రయత్నం చేస్తే, కాలు బెణకడం లేదా ఎముకలు విరగడం ఖాయం.

చేప పిల్ల తారెక్
* ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడిన అత్యంత పిన్న వయస్కురాలిగా బహ్రెయిన్‌కు చెందిన అల్జాయిన్ తారెక్ రికార్డు నెలకొల్పింది. 2015 వరల్డ్ కప్ మహిళల 50 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో పోటీ పడే సమయానికి ఆమె వయసు కేవలం పదేళ్లు. ఆ రేస్‌ను ఆమె 41.13 సెకన్లలో పూర్తి చేసింది. అదే ఏడాది మరో విచిత్రం కూడా చోటు చేసుకుంది. జపాన్‌కు చెందిన మియేకో నగోకా పురుషుల 1,500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీకి దిగాడు. వందేళ్ల వయసులో అతను ఉత్సాహంగా యువ స్విమ్మర్లతో పోటీపడ్డాడు. మొత్తం మీద 2015 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో అతి తక్కువ, అతి పెద్ద వయసు స్విమ్మర్లు బరిలోకి దిగి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

- సత్య