ఆటాపోటీ

ఓల్డెస్ట్ స్ట్రోక్ ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్విమ్మింగ్‌లో అన్నింటికంటే పురాతనమైన స్ట్రోక్ ఏది? ఈ ప్రశ్నకు అనేక అధ్యాయనాల తర్వాత బ్రెస్ట్ స్ట్రోక్‌గా నిపుణులు ఖాయం చేశారు. నీటిలోకి దూకిన వెంటనే, బ్రెస్ట్ స్ట్రోక్ ద్వారానే ముందుకు కదులుతారు. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నాటికే స్విమ్మింగ్‌లో ఈ విధానాన్ని పాటించేవారని చెప్పడానికి ఆధారాలున్నాయి.
ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ మొట్టమొదటిసారి 1896లో రంగ ప్రవేశం చేసింది. అయితే, మొదట్లో పురుషులకు మాత్రమే పరిమితం చేశారు. ఆ తర్వాతి ఒలింపిక్స్‌లో అంటే 1912లో మహిళల విభాగంలోనూ స్విమ్మింగ్ పోటీలు మొదలయ్యాయి.
చెమటపడుతుంది: నీళ్లలో చెమటపడుతుందా? అవును అని ఎవరైనా అంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ, ఇది అక్షరాలా నిజం. ఒక అథ్లెట్ శ్రమించినప్పుడు ఏ విధంగా అతని శరీరానికి చెమటపడుతుందో, ఒక స్విమ్మర్ ఈత కొడుతున్నప్పుడు అదేవిధంగా చెమటపడుతుంది. అయితే, ఎంతసేపు ఈత కొడితే, ఎంత పరిమాణంలో శే్వదం విడుదలవుతుందనేది ఇంకా నిర్దారణ కాలేదు. స్విమ్మింగ్ చేసిన తర్వాత శరీరం విపరీతమైన అలసటకు గురవుతుంది. దీనితో దాహం వేస్తుంది.
సగం మందికి ఈత రాదు: దాదాపుగా అన్ని దేశాల్లోనూ జనాభాలో సగం మందికి ఈత రాదని రెడ్‌క్రాస్ సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ఈత వచ్చినవారిలో సుమారు 33 శాతం మందికి నామమాత్రపు ప్రవేశం ఉందట. అంటే, వీరు నీటిలో మునగకుండా తమను తాను కాపాడుకోగలుగుతారే తప్ప, నైపుణ్యాన్ని ప్రదర్శించలేరు. ఐదు శాతం మందికి కేవలం కనీస పరిజ్ఞానం మాత్రమే ఉంది. మిగతా 12 శాతం మంది స్విమ్మింగ్‌లో రాణించగల సత్తాగలవారు. కానీ, వీరిలో సగం మంది కూడా పోటీలకు హాజరుకారు.