ఆటాపోటీ

బామ్మగారి ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని డయానా న్యాద్ నిరూపించింది. అమెరికాకు చెందిన ఈ సుప్రసిద్ధ రచయిత్రికి స్విమ్మింగ్ అంటే ప్రాణం. హవానా (క్యూబా) నుంచి ఫ్లొరిడా వరకు 110 మైళ్లు (180 కిలోమీటర్లు) ఈదడానికి ఆమె ఒకటికాదు.. రెండు కాదు.. ఐదు పర్యాయాలు ప్రయత్నించింది. ప్రతిసారీ విఫలమైనప్పటికీ ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. రెట్టించిన పట్టుదలతో శ్రమించింది. చివరికి తన 64వ ఏట ఆమె అనుకున్నది సాధించింది. 2013 ఆగస్టు 31న ఈతను మొదలుపెట్టిన ఆమె సెప్టెంబర్ 3న ఫ్లొరిడా చేరుకొని, ఎక్కువ దూరం ఈత కొట్టిన మహిళగా సరికొత్త చరిత్ర సృష్టించింది.