ఆటాపోటీ

వెబ్ ది గ్రేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లీష్ చానెల్‌ను ఈదడానికి అత్యంత సాహసం కావాలి. అంతులేని ఆత్మవిశ్వాసం, అనితర సాధ్యమైన కృషి, అద్భుతమైన ఫిట్నెస్ ఉండాలి. ఇన్ని లక్షణాలు కలిస్తేనే ఇంగ్లీష్ చానెల్‌ను ఈదడం సాధ్యమవుతుంది. మొట్టమొదట ఈ ఘనతను అందుకున్న స్విమ్మర్ కెప్టెన్ మాథ్యూ వెబ్. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన వెబ్ 1875 ఆగస్టు 25న డొవ్ నుంచి కలాల్స్ వరకు 26 మైళ్ల (41.83 కిలోమీటర్లు) దూరాన్ని అతను 22 గంటల్లో పూర్తి చేశాడు. అప్పటివరకూ ఎవరూ చేయని సాహసాన్ని అతను చేసి చూపించాడు. కాగా, ఇంగ్లీష్ చానెల్‌ను ఈదిన తొలి మహిళగా గెర్‌ట్రూడ్ ఎడెర్ల్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 1926 ఆగస్టు 6న ఆమె ఈ ఫీట్‌ను నమోదు చేసింది. ఇక భారత్ తరఫున పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిహిర్ సేన్ 1958లో ఇంగ్లీష్ చానెల్‌ను ఈదితే, అతని నుంచి స్ఫూర్తిని పొందిన అదే రాష్ట్రానికి చెందిన ఆర్తీ 1959లో ఈ ఘనతను సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది.