రాజమండ్రి

తిరిగిరాని కోయిల! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుజాతి వైభవాన్ని
తెలుగు భాష మాధుర్యాన్ని
తెలుగు పాట సోయగాన్ని
దశదిశలా చాటిన మేధోనిధి
విశ్వంభరతో జ్ఞానపీఠాన్నధివసించిన
పుంభావ సరస్వతి
నన్ను దోచుకొందువటే అంటూ
వలపు తలపులు చిలకరించినా
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో అని
శిలలలో మృదుభావాలు పలికించినా
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని
స్వేచ్ఛాగీతం ఆలపించినా
ఏ తోడూ లేనినాడు నీ నీడే
నీకు తోడన్న జీవిత సత్యాన్ని
చాటిన గొప్ప తాత్వికవేత్త
ఉర్దూ గజళ్లకు తెలుగు భాషలో ప్రాణప్రతిష్ఠ చేసి
ప్రకృతిని పరవశింపజేసిన గాయకుని
గళమాధుర్యం ఇక వినిపించదు
సాహిత్యంలో చమక్కులు, గమ్మత్తులు
సృష్టించిన సినారె కలంలో
ఎప్పటికీ ఇంకిపోని శృతి లయ సిరా
అనుబంధం, ఆత్మీయత అంతా
బూటకమని చాటుతూ
మాటల్లో పాటల్లో కావ్యాల్లో
తెలుగు అక్షరాల్లో అమరుడిగా
ప్రజల మనస్సుల్లో చిరస్మరణీయుడిగా
తిరిగిరాని లోకాలకు తరలిపోయిన
మాటల పాటల కోయిలా..
నీకిదే మా నివాళి!
- డా. మైలవరపు లలితకుమారి
చరవాణి : 9959510422

పుస్తకం మస్తకం

తొలిచూపులో ప్రేమ జనించటం కాదనలేం
ముందుకు పోవటానికి మరింత బలం కావాలి
నీతో ఎప్పుడు ప్రేమలోపడ్డానో గుర్తులేదు
నా కళ్లకు వెలుగుల గవాక్షానివి
నా ఆలోచనలకు ప్రతిబింబానివి
అందుకే నీమీద నాకంత ప్రేమ
అభిమానం, ఆదరణ, ఆకర్షణ
నువ్వు అక్షరకుక్షిలో
అమృతభాండానివి
పదునైన మేధకు పునాదివి
లోకాన్ని చూపించే జ్ఞాననేత్రానివి
అందుకే నువ్వంటే అలవిగాని అభిమానం
అనంత ఆకాశమంత ఇష్టం
తిమిరానే్న తరిమేసే నీ హృదయమంటే
నాకు ప్రాణం
కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్న వేళ
నీ సాహిత్యపు వారాసి చుక్కానైంది
అమ్మ చెయ్యంత ఆప్యాయంగా
పలకరించే నీ హృదయ నేత్రం
అనంత సాగరం
నీ సాహితీ సౌరభం
నాన్న ప్రేమంత ఆప్యాయం
నీ అడుగులో అడుగు కలిపిన వేళ
నాకెంతో తృప్తినిస్తుంది
నా మస్తకంలో పురుడుపోసుకునే
అక్షరరూపం ఇచ్చేది నీరూపే..
నాలో ఊపిరి ఆగిపోయేదాకా
నీ రూపమే ధ్యానిస్తా
నీ నామమే జపిస్తా
నా హృదయపు తంత్రులు నీకోసమే
నా ఆరాధ్య దేవతా..
నువ్వు జ్ఞానకలశానివి
మెరుపు శకలానికి
నువ్వు అక్షరానివి!
- వేలూరి సుధారాణి,
చరవాణి : 93921108186

మధురకవీ..

సీ. ‘ముద్దు’ముద్దుగ ‘గోరుముద్దలు’ తినిపించు
మేటి నీతుల బాలమిత్ర అతడు
పాలమీగడ తరంగాల లోపల ‘వెన్న
బుడగౌ’చు కథలల్లు బుడతడతడు
‘వెనె్నల వెలుగుల’ ‘విరిదండ’ ధరియించి
పరుగెత్తు గీతాల చిఱుతడతడు
ఆంగ్లంబు నందుండి అందవౌ అనువాద
‘దీపావళీ’ రూపదీప్తి అతడు
స్మృతుల రసపాయి ‘పాపాయి’ కృతి అతండు
‘ప్రేమ-సాగరమై’ పొంగ వెలుగు నవల
అతడు; ‘గాంధీ దశావతారా’క్షరుండు
బాలల కవిత్వ జీవైక ‘నాళమ’తడు
‘కృష్ణరావు’కు వందనం బేనొనర్తు

సీ. సత్యాగ్రహోద్యమ స్వైరి అంటకు లాఠి
చార్జి - పెద్దాపురం - సత్యసాక్షి
స్రె్తైణాభ్యుదయ కృషి స్వామి అంటకు ‘ఊటు
కూరి లక్ష్మీకాంత’ నారిసాక్షి
హరిజనోద్ధరణైక హారియంటకు సోద
రాదరం బొందు ‘శేషయ్య’ సాక్షి
గ్రంథాలయోద్యమ కారుడంటకు ‘రాజ
మండ్రి’లో ‘గౌతమి’ మహిత సాక్షి
సంపాదక ప్రపంచార్కుడంటకును ‘మా
నవసేవ’ పత్రిక నవ్యసాక్షి
ఇదియది యనంగనేల?
‘సంస్కృతి - సమాజం -
దేశములనుద్ధరింపంగ దీక్షబూను
‘కృష్ణుడ’నుటకు అతులిత కీర్తి సాక్షి
ఆయన గురించి పల్కనర్హత గలాడు
కలడు ఒక్కడే ఒక్కడు - కర్మసాక్షి’!
- డా. రామడుగు వెంకటేశ్వరశర్మ,
చరవాణి : 9866944287