నెల్లూరు

పనిపిల్లోడు కథ బాగుంది ( స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనిపిల్లోడు కథ చాలా బాగుంది. జగదీష్, రైతు సిద్దయ్య మధ్య సాగిన సంభాషణలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. పిల్లలపై కుటుంబ భారం పడితే వారి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అన్నీ వున్న పిల్లలకు చదువు విలువ తెలియక చెడుదారులు తొక్కుతున్నారు. కానీ బాలకార్మికులకు చదువుకోవాలనే ఆశ వున్నా వారికి విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే. దాతలు స్పందించి ఇలాంటి బాలకార్మికులను అక్కున చేర్చుకుని వారి భవితకు బంగారు బాటలు వేస్తే సమాజానికి సేవ చేసిన వారవుతారు. మంచి కథను అందించిన రచయిత యర్రాబత్తిన మునీంద్ర గారికి ధన్యవాదములు.
- పిజె రాఘవాచార్యులు, తిరుపతి
- అయినవోలు సత్యవతి, నెల్లూరు
- పి వర్మ, నెల్లూరు

గోమాతకు జేజేలు

లక్కరాజు శ్రీనివాసరావు గారు రాసిన గోవిలాపం కవిత అద్భుతం. నిజంగా గోవుకు సృష్టిలో గొప్పస్థానం వుంది. అటువంటి గోవు తన ఆవేదనను కృష్ణుని ముందు ఆవిష్కరించిన తీరు అద్భుతం. గోపీలోలా నీవే మాకు దిక్కు.. మా బాధలు ఒక్కసారి చూడు అంటూ గో విలాపం ద్వారా గోవుల దీనగాథను చక్కగా మనకు అందించిన రచయితకు మా హృదయపూర్వక అభినందనలు.
- జెజె హరికృష్ణ, చీరాల
- రావి అనంతయ్య, మార్కాపురం
దోబూచులాట కవిత బాగుంది
మెరుపులో దుప్పటి రమేష్ గారు రాసిన దోబూచులాట కవిత చాలా బాగుంది. చిన్న కవిత అయినా గొప్ప భావాన్ని పొందుపర్చారు. అభినందనలు
- చిన్నికృష్ణ, కుమ్మరివీధి,గూడూరు
- భాస్కర్, కోవూరు