నెల్లూరు

విధి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదురుగా...
ఎంతో గంభీరమైన సముద్రం.
తీరాన్ని ముంచేట్లుగా ప్రళయ భీకరంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి అలలు. అలలు ఆవేశంగా వచ్చి తీరానికి తగిలి మరణిస్తున్నాయి. సముద్రం తీరం వైపు చూస్తూ నాదంటూ వచ్చే ఓరోజు నా అలలతో నిన్ను కబళింపచేస్తానని అంతరంగంలో ఆవేశంగా ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా ఉంది.
సముద్రం ఎప్పుడూ ఓ ప్రశే్న!
తాత్వికులకు, భావుకులకు, శాస్తవ్రేత్తలకు, కవులకు అది ఛేదించలేని ప్రశే్న మరి. దూరంగా చూస్తే ఆకాశం, సముద్రం నీలం రంగులో కలిసున్నట్లు కనిపిస్తాయి. కాని అది నిజం కాదు. ఔను అదో భ్రాంతి.
రెండు రోజుల్నించి ఓ జంట సముద్రానే్న తదేకంగా చూస్తున్నారు. వారి పిల్లలిద్దరూ కాస్త దూరంగా ఇసుకతో ఇల్లు కడుతున్నారు. అలలు వాటిని తోసేస్తున్నాయి. అయినా ఆ పిల్లలు నిరాశపడక మళ్లీమళ్లీ కడుతున్నారు.
దాన్ని చూసి అతను ‘కాలం కనే కలల్ని అలలు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నాయి’ అన్నాడు. ‘అవునండి నిన్నటిదాకా మన స్థితికి, నేటి మన పరిస్థితికి మధ్య ఎంత తేడానో, జీవితమంటేనే అందకుండా చేసి విచారింపచేసేది కదా’ అన్నది ఆమె.
బీచ్‌కొచ్చిన జనం దూరంగా అక్కడక్కడా కూర్చోనున్నారు. అయితే ఆ జంట వౌనంగా మళ్లీ సముద్రానే్న చూస్తోంది. ఆ అలల శబ్ధం మనసుల్లోని నిశ్శబ్దాన్ని ఛేదిస్తోంది. వాళ్లిద్దరినీ గతం తాలూకు జ్ఞాపకాలు వెంటాడి వేధిస్తున్నాయి.
‘మన సమస్యల కన్నా సముద్రం చాలా చిన్నదిగా ఉన్నట్టుంది’ అన్నది ఆమె. ‘అవును సమస్య చిన్న సుడిలా మొదలై తరచి తరచి చూచేకొద్దీ అది ఓ అఖాతంలా మారిపోతుంది ’ అన్నాడు అతను. ‘అయినా ఎట్లా బతికిన వాళ్లం ఎట్లా అయిపోయాం. దగ్గరివాళ్లే మనపాలిట శత్రువులవుతారనుకోలేదండి ’అంటూ ఏడుస్తోంది. అతను ఆమెను సముదాయించాడు. కాసేపటికి తేరుకుని ‘ఏంచేద్దామండి’ అని అడిగింది.
‘ఈ సమస్యలన్నింటికీ ఒకటే పరిష్కారం అందరం ఆత్మహత్య చేసుకోవడమే’ అన్నాడతను. ఆమె భయంగా అతనివైపు చూసింది. ‘పిల్లలు మరీ చిన్నవాళ్లండీ’ అంటూ ఏడ్చింది. అంతకుమించి చేయగలిగిందేమీ లేదన్నాడు నిర్లిప్తంగా. పిల్లలకు ఇవేమీ తెలియకుండా గవ్వలు ఏరుకుంటున్నారు. ఆమె ఏడుస్తూ నెమ్మదిగా గతంలోకి జారుకుంది.
మణిమేఖలై డెవలపర్సు కన్‌స్ట్రక్షన్సు రాజధానిలో ఓ పేరొందిన రియల్ ఎస్టేట్ సంస్థ. రాష్ట్రంలో వాళ్ల వెంచర్ లేని నగరం గాని పట్టణం గాని లేదు. వందల కోట్లలో వ్యాపారం జరుగుతుండేది. చాలా మంచి పేరుండే సంస్థ అది. వ్యాపారంలో కోట్ల రూపాయలు ఆర్జించాడు. దగ్గరివాళ్ల ద్రోహమా, రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడమో ఈ రెండింటిలో ఏది అసలు కారణమో గాని కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయింది. ఆ సంస్థ చైర్మన్ ఈశ్వర్రావు ఆయన భార్య విశాలక్ష్మి. వాళ్లే సముద్రాన్ని తదేకంగా చూస్తోన్నది.
విశాలక్షి అడిగింది ఏమండీ వేరే దారేమీ లేదా? దిక్కుమొక్కు లేకుండా ఇక్కడ చావవలసిందేనా? అంటూ పిల్లల వైపునకు చూసి మళ్లీ ఏడుస్తోంది.
అప్పుడు ఈశ్వర్రావు ఆకాశం వైపు చూస్తూ రూపాయ భలే చిత్రమైంది. అది మన దగ్గరుంటే మన వెనక్కు కొంతమందిని చేరుస్తుంది, లేకుంటే ఎంతోమంది వెనక్కు మనల్ని నెట్టేస్తుంది అన్నాడు ఎంతో ఆవేదనతో.
వాళ్ల ఆలోచనల్లాగే సూర్యుడు అలసిపోయినట్టున్నాడేమో విశ్రాంతికై పడమటి వైపు వాలిపోతున్నాడు. మసక చీకట్లు ముసురుకుంటున్నాయి. జనం నెమ్మదిగా ఇళ్లకు బయలుదేరుతున్నారు. పక్కనే ఓ కుక్క దొరికిన ఎంట్రకాయని పటపటమని తింటోంది. కొంతమంది ఆడవాళ్లు ఎండబెట్టిన చేపల్ని బుట్టల్లోకి సర్దుతున్నారు. ఆ రోజూ సముద్రం బాధగా ఘోషిస్తున్నట్టుంది.
అప్పుడు ఈశ్వర్రావు లేచి ఏదో నిర్ణయానికి వచ్చినట్టు ఈ భూమీద మనకు చివర్రోజు రేపే! అంటూ పిల్లల్ని, భార్యని కాటేజిలో విడిచాడు. అక్కడ్నుంచి ఓ ఆటో మాట్లాడుకుని దగ్గర్లోని టౌనుకెళ్లి పాత ప్రిస్కిప్షన్‌తో చాలా మందుల దుకాణాలు తిరిగి నిద్రమాత్రలు తీసుకున్నాడు. అతని మొహం కళావిహీనమై వుంది.
తూర్పున వేగుచుక్క పొడిచింది. పక్కనున్న ఇళ్లల్లో కలకలం బయల్దేరింది. వేటకెళ్లే జాలర్లు, వాళ్లను సాగనంపటానికొచ్చిన వాళ్ల భార్యలు, పట్టర పట్టు అంటూ పడవల్ని నీళ్లల్లోకి లాగేవాళ్లు.
ముసిముసిగా నవ్వుతున్న ఆడవాళ్లు, వాళ్ల మొహాలు అపుడే విరిసిన మల్లేల్లా వున్నాయి. అంత స్వచ్ఛమైన నవ్వుకు కారణం మనసులో ఎటువంటి స్వార్థం లేకపోవడమే. విశాలమైన సముద్రంలో చేపలు పడతాయో? పడవో? అయినా బతుకు మీద ధీమా! వాళ్లు కాలానికి గాలం వేసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
వాళ్లల్లో ఓ మత్స్యకారుడు తన పెళ్లాంతో భయం భయంగా అంటున్నాడు. థూ...దీనెమ్మ బతుకు ఇరవై రోజుల్నించి సేపలు పడ్డం లేదెసే. అప్పులోళ్లకి ఏం చెప్పాలబ్బా అంటున్నాడు విచారంగా. ఏందయ్యో అప్పుంటే బిత్తరపోతే తగ్గతాదా? ఈ రోజు గాకపోతే రేపు తీర్చేద్దాం. భయపడ్తే గంగమ్మతల్లి అన్నం బెట్టదు. దానికే గదా సేపలు పడంది.
ఈరోజు బడ్తాయి, మన దరిద్రం తీరిపోతాదిబో అన్నాది. ఆమె కళ్లల్లో ఎంత ధైర్యం, మాటల్లో ఎంత ఆశ! బతుకు మీద ఎంత గొప్ప ఆశ. ఈశ్వర్రావు కళ్లల్లో ఓ మెరుపు మెరిసింది. అవును బతకాలి, బతకాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.
అతని మనసులో ఓ ఆలోచన రూపుదిద్దుకుంది. ఇక్కడైతే మనం అందరికి బాగా తెలుసు. వేరే రాష్ట్రానికి వెళితే అక్కడ మనం ఎవరికి తెలియదు కాబట్టి తిరిగి జీవితాన్ని మొదలుపెట్టచ్చుగా అన్నాడు భార్యతో. ఔను ఎక్కడైనా కొత్త జీవితం మొదలుపెట్టడానికే నిర్ణయించుకున్నారు. లేకుంటే నాలుగు జీవితాలు నిర్దాక్షిణ్యంగా ముగిసిపోయేవి. ఒక్క క్షణం ఆలోచన తాత్కాలిక ఆవేశాన్ని జయించింది. ఈశ్వర్రావు అప్పులవాళ్లందరికీ ఓ ఉత్తరం రాసి తన ఆస్తుల వివరాలు, అప్పుల లెక్కలు రాసి తగిన విధంగా పంచుకోమని అభ్యర్థించాడు.
ఈలోగా విశాలక్షి ఆ జాలరి భార్యతో మాటకలిపి తన పిల్లల బట్టలు, చీరలు కొన్ని ఇచ్చి, వాళ్ల బట్టలు కొన్ని తీసుకుంది. ఎందుకంటే ఏదో సర్దిచెప్పింది.
ఇవాళ రాత్రికి ట్రైన్‌కి రిజర్వేషన్ చేయిస్తానంటే మనం ఇకనుండి థర్డు క్లాసులోనే ప్రయాణించాలన్నది విశాలాక్షి. ఆరోజు రాత్రి వారి జీవితంలో ఓ కొత్త ప్రయాణం. అలా కొత్త జీవితానికి వాళ్లు శ్రీకారం చుట్టారు. పిల్లలూ, వాళ్లు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు వెళ్లే రైల్లో సీట్లు దొరక్క కింద కూర్చొని ప్రయాణిస్తున్నారు. అవును మరి ఇది విధి ఆడించే కొత్త ఆట మరి.
మైసూరుకు దూరంగా హైవే రోడ్డుపక్కనున్న ఓ మోస్తరు గ్రామం హోసూరు. చుట్టూ అడవి ఆహ్లాదకరమైన వాతావరణం. మోసం, కుట్ర, దగా ఏమీ తెలియని స్వచ్ఛమైన ప్రజలు. అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారు. రోడ్డుపక్కన ఓ చిన్నగుడిసె వేసుకున్నారు. మొదట్లో అక్కడ భాష అర్థమయ్యేది కాదు. కాలం గడుస్తూ ఉంది. విశాలాక్షి అక్కడే చిన్న హోటల్‌లో వంటపనికి కుదురుకుంది. ఈశ్వర్రావు చిన్నచిన్న పనులు చేస్తున్నా వాటిలో నిలకడ లేకపోయేది. చివరకు అడవిలో గొర్రెలు మేపేందుకు కుదురుకున్నాడు. అతని స్థితికి విశాలాక్షి కన్నీరు పెట్టుకునేది. పిల్లలకు స్నేహితులేర్పడ్డారు.
ఈశ్వర్రావును గుర్తుపట్టలేనట్టుగా తయారయ్యాడు. బవిరి గడ్డం, చింపిరి జుట్టు, పాత బట్టల్తో చేతికర్ర, అన్నం టిఫిన్‌తో అడవికి వెళ్లేవాడు. అడవిలో గొర్రెల్ని తోలి అక్కడే ఓ కూలడానికి సిద్ధంగా ఉన్న ఓ పాత రాతి మండపంపై కూర్చొని గొర్రెల్ని గమనించేవాడు. ఈ మండపం రాయల కాలంనాటిది. రాయలు వేటకు వచ్చి విడిదిచేసే చోటది. చీకటి పడేవేళకు తిరిగొచ్చేవాడు. విధి చిలా చిత్రాలు చేస్తుంది. మహరాజులా ఉన్నవాడ్ని క్షణాల్లో గొర్రెలకాపర్ని చేసేసింది.
ఓరోజు మామూలుగానే గొర్రెల్ని తోలుకుని అడవికి వెళ్లాడు. వాటిని మేతకు తోలి మండపంపై నడుంవాల్చాడు. పిల్లల దుస్థితి తలుచుకుని పసిపిల్లాడిలా ఏడ్చాడు. లేచి నెమ్మదిగా నడుస్తుంటే దూరంగా ఉన్న గొర్రెను అదిలించేందుకు రాయి విసిరాడు. అది గురితప్పి మండపం పైనున్న తామరపువ్వుకు తగిలి ఖణేల్ మనే శబ్దం వచ్చింది. గొర్రెను అదిలించి మందలో కలిపి మండపం దగ్గరకు వచ్చి పైకిచూశాడు. పైనున్న తామరపువ్వు చాలాపెద్దది. నల్లగా చిలుము పట్టినట్లుంది. దీన్ని పాత సామాన్లకిచ్చినా ఓ వంద రూపాయలైనా రాకపోతాయా అని అనుకున్నాడు.
అదేమో కొంత ఎత్తులో ఉంది. తీరాచూస్తే రాయి తగిలిన చోట మెరుస్తున్నట్టనిపించింది. చుట్టూ ఉన్న దుంగలేసి దానిపైకెక్కి కష్టపడి రాయితో కొట్టి చిన్నముక్కను విరుచుకొచ్చాడు.
దాన్ని తీసుకువచ్చి విశాలాక్షికి చూపించాడు. ఆమెమో పెదవి విరిచింది. అయినా ఈశ్వర్రావు ఎంతో నమ్మకంతో దాన్ని బంగారు దుకాణంలో చూపుతానన్నాడు. ఈ వేషంలో వెళ్తే లోపలిక్కూడా రానివ్వరంది. అవునుకదా అన్నాడు సాలోచనగా.
మరుసటిరోజు క్రాఫింగ్ చేయించుకుని పెట్టె అడుగునున్న మంచి బట్టలు వేసుకుని కొంత డబ్బుతో మైసూరు వెళ్లాడు. దర్జాగా ఓ పెద్ద బంగారు దుకాణంలోకి వెళ్లి చక్కని ఇంగ్లీషులో ‘‘మే ఐ నో ది గోల్డు టచ్ ప్లీస్’’ అని అడిగాడు. ‘‘కొద్దిసేపటికి దిసీస్ ప్యూర్’’ అన్నాడు కౌంటర్లోని వ్యక్తి. దారిలో ఓ నెట్ సెంటర్‌లో గోల్డు పాలిశు విధానాన్ని తెలుసుకుని కావలసిన వస్తువులు, ఓ యాక్సా బ్లేడు తీసుకొచ్చాడు.
ఆ మరుసటి రోజు తాను గొర్రెల్ని తోలుకెళ్లి యాక్‌సా బ్లేడుతో కోసి గోతాంలో దాచి గడ్డి మోపులో కట్టుకుని ఇంటికొచ్చాడు. కొన్ని రోజులు కష్టపడి దాన్ని పాలిష్ చేసేసరికి కొంత మెరుపు వచ్చింది.
ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు. ఇద్దరికి తెలిసిన వాళ్ల దగ్గర నలభై వేల రూపాయల దాకా పోగుచేశారు. ఓ రేకు నొకదానిని కత్తిరించి దానిని తిరిగి నాలుగు ముక్కలు చేశాడు. పెద్ద ముక్కైతే అనుమానం వస్తుందని అతని ఆలోచన. తన దగ్గరున్న డబ్బుతో ఓ పాత రింగు కొని మరో దుకాణంలో దానిని రేకులోని చిన్న ముక్కనిచ్చి ఓ లాంగ్ చైన్ చేయించి దాన్ని అమ్మేయడం. అలా నెమ్మదిగా బంగారాన్ని అమ్మి కొన్ని లక్షల రూపాయల పెట్టుబడి సమకూర్చుకున్నాడు. మైసూరు పట్టణానికి దగ్గర్లో ఓ వెంచర్ వేసి తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ వెంచర్ పేరు మండపం రియల్ ఎస్టేటు. అయితే ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టి, అప్యాయతను పంచిన హోసూరుని విడవక అక్కడే స్థిరపడ్డారు.

కావేరిపాకం రవిశేఖర్, నాయుడుపేట. చరవాణి 9849388182