విశాఖపట్నం

దేహంకన్నా దేశం మిన్న (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరవీరుల దినోత్సవం నాడు భర్త ఫొటోకు పుష్పాంజలి ఘటించి తదేకంగా ఫొటోను చూస్తూ ‘ఏమండీ మీ ఆశయ సిద్ధికోసం నేను నిరంతరం శ్రమిస్తున్నాను. మీరు మమ్ము వీడి పైలోకం చేరినా, మీ ఆశయాలు మా హృదయాలలో వికసిస్తున్న కమలాలే. పెద్దవాడు భరత్ కర్షకునిగా నాలుగు నోళ్లకు ఇంత ముద్ద పెట్టగలగుతున్నాడు. చిన్నవాడు భగత్ కోడి రామ్మూర్తి వ్యాయామశాల వారు ఏర్పాటు చేసిన జాతీయ క్రీడల్లో క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌గా ప్రథమ స్థానంలో నిలిచాడు. వాడ్ని దేశరక్షణ కోసం సైన్యంలో చేర్పిస్తా! మీకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలుపుకుంటా’ అంటూ పెల్లుబుకుతున్న ఆనందబాష్పాల్ని పమిట చెంగుతో అద్దుకొంటుండగా ఎవరో వస్తున్న అలికిడి వినబడింది.
భుజంపై ఉన్న నాగలి పశువుల పాక పక్కనే ఉంచి కుండీలో నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించిన భరత్‌కు తుండు అందించింది స్వరాజ్యం.
‘‘అమ్మా! తమ్ముడేడి?’’ అడిగాడు భరత్.
‘‘వాడు ఇంటి పట్టున ఉంటాడట్రా. స్నేహితులతో కలసి షికార్లకు వెళతాడు. రాగానే మందలించు. బొత్తిగా భయం భక్తి లేకుండా పోతున్నాయి. ఉన్న నాలుగు రోజులు మాతో కలసి మెలసి ఉంటే ఆనందం. అలా వీధులు పట్టిపోతుంటే మాకెలా ఉంటుంది చెప్పరా! మీనాన్న కిచ్చిన మాట కోసం నిన్ను సైన్యంలో చేర్పించాలి అనుకుంటున్నా. అందాక ఈ నాలుగు రోజులు ఇంటిపట్టున ఉండరా’’ అనగానే పక్కలో బాంబు పేలినట్లు అదిరిపడ్డారు అన్నదమ్ములిద్దరూ!
తల్లి ఆశీస్సులు తీసుకొని క్రికెట్‌జట్టులో చేరాలన్నదే భగత్ తపన. కానీ తల్లి మాటలతో తన ఉత్సాహం నీరుగారిపోయింది. ఆమెను ఎలా అయినా ఒప్పించి తన చిటికెన వేలుకు చుట్టుకొంటూ చిన్న పిల్లాడు మారాం చేస్తున్నట్టు ‘‘అమ్మా... అమ్మా నా మాట వినవే. ఈ రోజు నాకున్న ప్రతిభతో ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ శిక్షకునిగా చేరి ఆనందమైన జీవితం అనుభవించవచ్చు. కానీ జాతీయ స్థాయి క్రీడాకారునిగా భారతావని పేరు ప్రపంచం నలుమూలలా మారుమ్రోగించాలన్నదే నా ధ్యేయం. నా రక్తంలోనూ నాన్నగారి దేశభక్తి ఉరకలు వేస్తుందమ్మా! ఏ రంగమైనా పేరు తెచ్చేదే గొప్పది కదమ్మా! నేను విజయం సాధిస్తే కోట్లాదిమంది ప్రేక్షకులు నీ కొడుకును టీవీల్లో చూస్తారమ్మా! రాష్టప్రతిగారు ప్రశంసా పత్రం అందజేసి అభినందిస్తారమ్మా! పెద్దపెద్ద కంపెనీలు కోట్లకొద్దీ ధనం కుమ్మరిస్తాయమ్మా! ఆటలో మేటి అనిపించుకుంటే కార్లు, భవనాలు, విలాసవంతమైన జీవితం కాదనకమ్మా’’ అంటూ ప్రాధేయపడుతూ తన కళ్లముందు వర్ణచిత్రం ఆవిష్కరించిన భగత్‌కు ఎలా నచ్చచెప్పి సైన్యంలో చేర్పించాలో అర్థంకాక భర్తకిచ్చిన మాట వమ్ము అవుతుందన్న బాధతో కుప్పకూలిపోయింది స్వరాజ్యం.
‘‘తమ్ముడు నాకన్నా చిన్నవాడివే అయినా బాగా ఆలోచించగల జ్ఞానం నీకుందని ఒప్పుకుంటా! నువ్వు చెప్పిన విలాసవంతమైన జీవితం, కీర్తి ప్రతిష్ఠలు కాదనను. నలుగురికోసం బతుకు నలుగురిని బ్రతికించడం కోసం చావు అన్నది నాన్నగారి సిద్ధాంతం. నలుగురికీ వెలుగును పంచే కొవ్వొత్తి తన కింద చీకటినే మిగుల్చుకుంటుంది. అది త్యాగం. క్షణికమైన భోగాలున్నా త్యాగగుణం శాశ్వత కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుందని తెలుసుకో. శ్రావణకుమారుడు, శ్రీరాముడు తలిదండ్రుల కోసం ఎంత పరితపించారో గుర్తు తెచ్చుకో. భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోష్, కట్టబ్రహ్మన లాంటి మహాపురుషులు భరతమాత బానిస సంకెళ్ళు ఛేదించడానికి ప్రాణాలు తృణప్రాయంగా సమర్పించిన చరిత్రను ఒక్కసారి అవలోకనం చేసుకో. ఈనాడు వారు ధనం కోసమో, కీర్తికోసమో ప్రాకులాడలేదు. దేహంకన్నా దేశం మిన్న అని భావించారు. స్వతంత్ర భారతావనిలో తమ ప్రాణ జ్యోతులు వెలిగించి వెలుగులు పంచారు. మిణుగురు పురుగులు ఎన్ని ప్రకాశించినా సూర్యోదయాన్ని చూపలేవు. నువ్వు మిణుగురు పురుగుకాకు. జ్యోతివై ప్రకాశించాలి. సూర్యబింబానివై వెలుగులు విరజిమ్మాలి. అందుకే ఈ దీపావళిని ప్రధానమంత్రి సైనికులకు అంకితమిచ్చారు. ఆ స్ఫూర్తితో ముందుకు అడుగెయ్’’ అంటున్న భరత్‌మాటలు భగత్‌లో ఆలోచనలు రేకెత్తించాయి. చిన్న కొడుకు ఆలోచనలో మార్పు రావాలని, తన భర్త ఆత్మకు శాంతి చేకూరాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంది స్వరాజ్యం.

- బండారు చిన్నరామారావు, లోగిశ-535270, విజయనగరం జిల్లా. సెల్ : 9553330545.