విశాఖపట్నం

ఆలోచింపజేసే ‘కరదీపికలు’ (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీవనంలో జీవిస్తున్న విశాఖపట్నంకు చెందిన రచయిత అడపా రామకృష్ణ ఆధ్వర్యంలో వెలువడిన మరో సంపుటి ‘సాహితీ ఉద్యమంలో కరదీపికలు’. ఉత్తమమైన కవితలు, కథలు, కథానికలు ఏర్చి ఒక సంపుటిలో వెలువరించడం రివాజు. అలాగే అప్పుడప్పుడు వ్యాసాలు వస్తుంటాయి. ఇలానే.. తాజాగా రామకృష్ణ కూడా అటువంటి పనిచేశారు. వివిధ దిన, వార తదితర పత్రికల్లో వెలువడిన వ్యాసాలను ఇందులో పొందుపరిచారు. ఒక సంపుటికి ‘ముందుమాట’ రాసే ఉద్ధండులు ఆ సంపుటిలోని అంశాన్ని నిశితంగా పరిశీలించి రాయాలని సూచిస్తున్నారు రామకృష్ణ తన ‘ముందుమాట అందరి కోసం కావాలి’ అనే వ్యాసంలో. ఇటీవల వెలువడిన కొన్ని సంపుటిల్లో రచన పేలవంగా సాగినా ‘ముందుమాట’లో పొగడ్తల వర్షం కురిపిస్తూ, పాఠకున్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ముందుమాట రాసే సీనియర్ రచయితలు నిష్పక్షపాతంగా వ్యవహరించి, ఆ రచనను లోతుగా పరిశీలించి, తన ‘అభిప్రాయాన్ని’ ప్రకటిస్తే ఆ రచయితతోపాటు ఇతర రచయితలకు అమూల్యమైన పాఠంలా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
తెలుగు భాషకు జీవనాడి అయిన సంస్కృతం గురించి సవివరంగా బోధించి, సాహితీలోకంలో శభాష్ అనిపించుకున్న పుల్లెల శ్రీరామచంద్రుడిని పాఠకులకు మరోసారి ఈ సంపుటిలో పరిచయం చేశారు. అధ్యాపకునిగా, అచార్యునిగా, బహు గ్రంథ రచయితగా వెలుగొందిన పుల్లెల చరిత్రను నేటి తరానికి ఎంతో అవసరం కూడా. అలాగే మత వ్ఢ్యౌన్ని తూర్పారబట్టిన కథకుడు అల్లం శేషగిరిరావు సాహితీ సేవ, శ్రీకాకుళం కథలగూడు వ్యవస్థాపకుడు కాళీపట్నం రామారావు తదితర సీనియర్ రచయితల సేవను ఈ సంపుటిలో అడపా ప్రస్తావించారు.

- కృష్ణమూర్తి