విశాఖపట్నం

మంచి మాట (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటికెపుడు గుంటు ఒంటి వ్యాధికి రట్టు
మడికి గట్టు పలుకుబడికి విట్టు
మీటు వీణకేమొ మెట్టు టార్గెట్టురా
నారిలేని విల్లు నారియు లేనట్టి
ఇల్లు వ్యర్ధములుర ఎంచి చూడ
విల్లు కన్న గొప్ప థ్రిల్లు ఇల్లురా
ఇంటిలోన ఎపుడు ఈగల మోతయే
పల్లకీల మోత బయట చూడ
అడరు ఉగ్రవాద మెడ పెడ మోతరా
ప్రార్థనంబు చేయు పైపై పెదవి కన్నా
సాయమిచ్చునట్టి చేయి మిన్న
మంచితనము అనెడి కంచుకంబున్న రా
- డాక్టర్ రామడుగు వేంకటేశ్వరశర్మ,
ఎన్‌టిపిసి దీపాంజలి నగర్,
విశాఖపట్నం-531020.
సెల్ : 9866944287.

బాల్యం మనోవికాసం

ఇల్లు విశ్రాంతినిచ్చే నిలయం
పాఠశాల విద్యనందించే ఆలయం
మనిషికి శాంతినిచ్చేది దేవాలయం
మనసును వికసింపజేసేది బాల్యం
పుట్టిన ప్రతి మనిషికి బాల్యమే పునాది
ప్రతి వారికి తన తల్లి ప్రథమ గురువు
క్రమశిక్షణ తల్లి పాటింపజేయాలి
నీతి, సత్యం గురించి విశదపరచాలి
తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు
తామొక విధంగా ఉంటూ నీతులు చెప్పకూడదు
తాము ఆదర్శంగా జీవించాలి
తాము పాటిస్తూ దిశా నిర్దేశం చేయాలి
- ఎ. నాగభూషణం,
బాబామెట్ట, విజయనగరం.
సెల్ : 8983956755.

బాల్యం

భూమిపై పడగానే నువ్వు
కెవ్వుమని కేకలు వేసి
నోరు చూపుతూ
కనులు విప్పుతూ
వెచ్చని ఒడి వెతుక్కుంటూ
పాలు తాగుతూ
నిద్రపోతూ
తుళ్లి పడితే
గుండెలకు నిన్ను
హత్తుకునేదెవరు?
ముద్దులతో ముంచెత్తేదెవరు?
నీ ఆకలి తీర్చి అక్కున చేర్చుకునేదెవరు?
నీతో ఊసులాడుతూ జోల పాడేదెవరు?
తన వెచ్చని స్పర్శతో నిను లాలించేదెవరు?
ఇంకెవరు అమ్మే
- విద్వాన్ ఆండ్ర కవిమూర్తి,
అనకాపల్లి,
సెల్ : 9246666585.

పేదల గోడు!

నోట్ల రద్దు మాబాధ పెట్టింది
నోటి కాడ కూటిని కానరాక చేసింది
నేడేమో జీయస్టీ అంటూ ఒళ్లు జిల్లు మనిపిస్తున్నారు
పేదల గోడు ఎవరికి పట్టేనయా
పెద్దలకేమో కాపు కాసేనయా
అందుకే ఈ ప్రభుత్వాలు ప్రతి అయిదేళ్లకు
ఒకసారి మారిపోతుంటాయయ!
- ప్రసాద్,
డాబాగార్డెన్స్,
విశాఖపట్నం.