సాహితి

కోతికి కొబ్బరికాయ దొరికింది! (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పారిజాతాపహరణం చెట్టు దొంగతనమా?’ (ఆంధ్రభూమి తేది 3-7-17) అన్న రామతీర్థగారి వ్యాసంపై ప్రతిస్పందన).. ఒక కోతికి కొబ్బరికాయ దొరికిందట! ఇంకేం? దాన్నది అటు త్రిప్పీ, ఇటు త్రిప్పీ చూసింది. వాసన చూసింది. కొరికి చూసింది. పెరికి చూసింది. ఎగరేసీ, పగలేసీ చూసింది. చివరికి విసిగి, వేసారి అదొక పనికిరాని వస్తువంటూ తిట్టుకుంటూ దూరంగా పెంటకుప్పపైకి విసిరేసిందట!... అదిగో, అలా మన నందితిమ్మనగారి ‘పారిజాతాపహరణ’మనే నారికేళం ఆంధ్రాంగ్ల భాషల్లో పండిత వర్యులైన శ్రీవెల్చేరు నారాయణరావుగారికిదొరికిందట! ఇంకేం దానిపై ఆంగ్లంలో ఒక మహాభాష్యాన్ని గిలికేశారు తమ ఎడం చేత్తో, అదొక ‘చెట్టు దొంగతన’మంటూ! దాంతో ఒక ‘సెనే్సషన్’ (సంచలనాన్ని) సృష్టించి మన (ఆర్ష) సాహిత్యమంతా పిచ్చి సాహిత్యమని, మన ఋషులూ, మునులూ మేధావులంతా వెర్రి వెంగలప్పలనీ దేశ దేశాల్లో చాటి, పేరుకి పేరునీ, డబ్బుకు డబ్బునీ దండుకోదలచాడన్నమాట! నిజం ఎవరి స్థాయి వారిదన్నట్లు, అర్థం, అంతరార్థం, ప్రతీకాత్మకత తెలియని పండితులు అంతకన్నా ఏం వెలగబెట్టగలరు? దాంతో మన శ్రీకృష్ణ భగవానుడు అడవి దొంగ వీరప్పన్ స్థాయికి పతనం కాగా, వీరప్పన్‌గారు శ్రీకృష్ణ భగవానుని స్థాయికి ఎదిగిపోయారు. భేష్! సరికొత్త యోచన? కూపస్థ మండూక యోచన! వీళ్ళని (పిచ్చి) పూల దండెత్తి మనం సత్కరించాల్సిందే! భారతరత్న, విశ్వరత్న బిరుదుల్తో సత్కరించాల్సిందే! ఉన్నట్టుండి మన రామతీర్థగారికి ఆర్ష సాహిత్యాభిమానం, స్వదేశాభిమానం పెల్లుబికిరావడం హాశ్చర్యమే! విదేశీ సాహిత్య ప్రభావంతో కొట్టుకుపోతూ, మన జాతినీ, సాహిత్యాన్నీ భ్రష్టుపట్టించిన పరమ నాస్తికులైన శ్రీశ్రీ, చలం, గురజాడ వంటివారిని తలకెత్తుకు తిరగాడిన వారిలో వీరొకరు. ఒక్కమాటలో చలానికి వీరాభిమానులు - వ్యక్తి పూజా దురంధరులు. అలాంటివారు మన ‘పారిజాతపహరణం’ గూర్చి దాని అంతరార్థం గురించీ, తహతహలాడి, విశదంగా, వివరంగా మనకు తెలియచెప్పాలనుకోవడమూ విశ్వవింతే! వీరు భారతీయ సాహిత్యాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలీదు.
పైకావ్యంలో పుష్పమంటే, పుష్పమనే మన రామతీర్థగారి భావన, ఈ భారతీయ పుష్పాన్నీ, మన సంస్కృతీ సంప్రదాయాన్నీసరిగ్గా సక్రమంగా వెల్చేరువారు విదేశీయులకు పరిచయం చేయలేదనే వీరి అభియోగం! బాగుంది! వెనకాల్టికో కథలో ‘వేదాల దొంగ’ ఎవరని ఓ బడిపంతులడిగితే మేం కాదంటే మేం కాదని విద్యార్థులంతా నానా గోల చేశారట!
ఇక్కడ పారిజాతమంటే ఒక పుష్పం కాదండీ! ఒక ప్రతీక. పరీమళాలనే కాంతుల్నివెదజల్లే నక్షత్రం. నందనవనమన్నా బృందావనమన్నా పూలతోటలు కావు. నక్షత్రవనాలు. కృష్ణుడంటే గొల్లవాడు కాడు. సూర్యభగవానుడు. మబ్బులనే గోవుల పాలు పితికినవాడు. మంచు ముద్దలనే వెన్నముద్దలతో ఆడుకొన్నవాడు. అష్టగ్రహాలే అతని అష్టపత్నులు. నక్షత్రాలే పదహారువేల గోపికలు. రుక్మిణీ అతని ప్రకాశం (సూర్యప్రకాశం) సత్యభామ ధరిత్రి. ఇంద్రుడొక మహానక్షత్రం. శచీదేవి నక్షత్ర ప్రకాశం. స్వర్గమంటే వెలుగు లోకం. ఇంద్రునితో కృష్ణుని యుద్ధం ఒక నక్షత్రయుద్ధం (ఎ స్టార్‌వార్). తొలి సంధ్యలో నక్షత్రాల మధ్య ఉదయించే సూర్యుడు తన భుజాన నక్షత్రాల కొమ్మని లేదా వృక్షాన్ని తనతోపాటు తీసుకువస్తున్నట్లుగా ఒక భావుకుడైన కవికి కనిపిస్తాడు. అదే ఒక మహాకావ్యమైపోయింది.
ఇదంతా వ్యాసుని మహాకల్పన. స్వర్గాన్ని భూమికి దింపే ప్రయత్నమే ఈ పారిజాతపహరణ వృత్తాంతం. నందితిమ్మన రచించిన పారిజాతపహరణం ఒక సుప్రసిద్ధమైన ప్రబంధం. దాని మూలకథ మనకు వ్యాసభాగవతంలోనూ, హరివంశంలోనూ కనిపిస్తుంది కొద్ది భేదాలతో.
రామాయణంలోని ఈత బంగారు లేడిని (నక్షత్రాల మచ్చలతో, సూర్యప్రకాశమనే బంగారు వనె్నతో మెరిసే మేఘాన్ని) కోరుకోవడం, భారతంలో భూప్రతీకమైన ద్రౌపది సౌగంధికాపుష్పా న్ని (నక్షత్రాల్ని) కోరుకోవడం, కుంతీదేవిఐరావతాన్ని (నక్షత్రప్రకాశమనే తెల్ల ఏనుగుని) కోరుకోవడం, గరుత్మంతుడు (సూర్యునికిరువైపుల రెక్కలవలె ఉండే ప్రకాశం) అమృతాన్ని(వెలుగుల్ని) భూమికి తీసుకురావడం, ఒకే ఇతివృత్తానికి సంబంధించినవే, కాకపోతే కవి కల్పనలు వేరు వేరు. హరివంశంలో రైవతక పర్వతం (ఆకాశం) పై తన వ్రత ఉద్యాపన గావిస్తోంది రుక్మిణి. అప్పుడు నారదుడు (నార+ద=నారద- ఒక నీటినిచ్చే ధవళ మేఘం) దేవలోకం (నక్షత్రలోకం)నుండి తాను తెచ్చిన పారిజాత పుష్పాన్ని (నక్షత్రాన్ని) కృష్ణునికి(సూర్యభగవానునికి) ఇస్తాడు. అతడు దాన్ని రుక్మిణి (వెనె్నల) సిగలో అలంకరిస్తాడు. ఇదే సత్య (్ధరిత్రి) అలుకకు కారణమవుతుంది.
రామాయణ భారత భాగవతాదుల్ని చరిత్రలుగా భావించే మహామహులూ కొందరున్నారు. అవి చరిత్రలు కావు కావ్యాలని మనమంటే వాళ్ళకి కోపం అరికాలినుండి నషాళానికి ఎక్కుతుంది. అగ్గిమీది గుగ్గిలమైపోతారు వారు. కానీ సత్యం సత్యమే కదా? అందుకే, ఇప్పటికైనా మనకు జ్ఞానోదయం కావాలి. మన సాహిత్యం సంస్కృతీ సంప్రదాయాలు, మన తాత్వికత శిఖరాగ్ర ప్రాయమనీ, నాడైనా, నేడైనా ప్రపంచానికి మన దేశానిదే గురుస్థానమనీ గుర్తించాలి. అందువల్ల విజ్ఞతతో మెలగాలి. ఒక రామకృష్ణునిలా, ఒక వివేకానందునిలా, ఒక రమణ మహర్షిలా ఒక గాంధీలా మన ఔన్నత్యాన్ని దశదిశలా చాటాలి. కాని మన అవగానా రాహిత్యంతో మన జాతికి జాతంతా తలదించుకునేలా చేయవద్దు. తల ఎత్తుకునేలా చేయాలి. అదే సకల భారత మానవాళి కోరుకునేది.

- గన్ను కృష్ణమూర్తి, 9247227087