సాహితి

కుటుంబ సమస్య - జాతక పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమిత్ర ఆ ఊరికి కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల. పెళ్లి ఊరేగింపు సమయంలోనే తన బాల్య స్నేహితురాలిని ‘రుక్మిణి’ని చూస్తుంది. ఆ రుక్మిణిలో వెనకటి చలాకీతనం, చురుకు లోపించినాయని గమనిస్తుంది. దీనికి కారణం ఏమిటో కనుక్కోవాలని తన మనస్సులోనే నిర్థారణ చేసుకుంటుంది. తన లక్ష్యాన్ని సాధించగలుగుతుంది, జ్యోతిషం చెప్పే పండితుడి సహకారంతోనే ‘ఆశయ సిద్ధిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు’ అని దీవెన పొందుతుంది, ఆ జ్యోతిష సిద్ధాంతి నోటిమీదుగానే. దానితో కుటుంబ సమస్య ఇట్టే పరిష్కారం అయిపోయే సూచన కనిపిస్తుంది.
ఈ కథ పేరు ‘కాటుక కంటి నీరు’. ఈ పేరు వినగానే బమ్మెరపోతనగారి భాగవత రచన వృత్తాంతం మనసుకు వస్తుంది, చిన్నతనంలో వినివున్న కధ గుర్తుకు వస్తుంది. పోతనగారు రాస్తున్న పుస్తకాన్ని ఎక్కడ రాజులకు అంకితం ఇస్తాడోనని భయపడిపోయి, చదువులతల్లి ‘్భరతి’ ఆయన ముందు సాక్షాత్కరిస్తుంది. ‘కాటుక కంటినీరు- చనుకట్టుపయిన్ పడంగ నేలనేడ్చదో’ అని మొదలుపెట్టి ఆ పుస్తకం నరాధములకు అంకితం ఇవ్వనని వాగ్దానం చేస్తాడు పోతనగారు. ఆ మాట నిలబెట్టుకుంటాడు చివరివరకూ. ఇంటి ఇల్లాలు కళ్ల నీరు పెట్టుకోకూడదు. ‘కలకంఠి కంట కన్నీరు ఒలికిన సిరి యింట నుండదు సుమతీ!’ అని సుమతీ శతకకారుడు కూడా ఒక పద్యంలో విన్నవిస్తాడు. కుటుంబం సుసంపన్నంగా వుండాలి. కుటుంబ శ్రేయస్సుకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకూడదు- అనేది తెలుగు కుటుంబాలలో నానుడి. తెలుగు కుటుంబాలనే కాదు, జగద్వ్యాపారం అంతటికీ సంబంధించిన సూత్రం ఇది. ఆడవాళ్లు పడే ఇబ్బందులు, పురుషులవల్ల వాళ్లకు అనవరతం అవలంబన అవుతున్న అవరోధాలు.. యిలాంటివన్నీ ఉద్యమ రూపం ధరించి స్ర్తివాదం అనే పేరు పెట్టుకున్న ప్రపంచమంతా బహుళ ప్రచారం జరుగుతూ వున్న రోజులకు ఎంతోముందు, ఈ సిద్ధాంతాన్ని ఆలవాలంగా తీసుకుని చక్కని తెలుగు కథను అల్లారు. ఈ కథ పత్రికలో అచ్చు అవడమే కాకుండా, శ్రీగోదా గ్రంథమాల (ముసునూరు, కృష్ణాజిల్లా) వారు సంకలనం చేసి ప్రచురించిన పుస్తకం ‘మధురాంతకం రాజారాం కథలు’ అనే దానిలో ప్రముఖ స్థానం వహించింది (1969లోనే). ఆ తరువాత వచ్చిన కథాసంకలనాలలో చోటుచేసుకున్న వైనం కూడా దొరుకుతుంది, తీరుబడిగా వెదికే ఓపిక వుంటే.
కుటుంబం అన్న తరువాత ఎన్నో ఇబ్బందులు, సబ్బందులు వస్తుంటాయి. అన్ని కష్టాలకు, దుఃఖాలకు వెంటనే కారణాలు వెదకడం కష్టం అయిపోతుంది. అయినా, జీవిత సూత్రం ఏమంటే ఎవరికీ జీవితంలో కష్టాలు, సుఖాలు తాము ఆహ్వానించినందువల్లనే వస్తాయి తప్ప, ఆకాశం నుంచి అకస్మాత్తుగా ఊడిపడవు. జీవితాన్ని సమరసంగా నడిపించుకొనడం ఆయా మనుషుల ఆలోచన ధోరణులలోనూ, రీతి నీతులలోను ఆధారపడి ఉంటుంది. దీనినే వేదాంతపరంగా చెప్పుకున్నప్పుడు ‘కార్యకారణ సంబంధం’ అని పేరు పెడతారు.
మళ్లీ కథలోనికి వస్తే రుూ జీవిత సూత్రం ఎట్లా సమన్వయం చేయగలిగాయో స్పష్టం అవుతుంది. సుమిత్ర కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల అని చెప్పుకున్నాంగదా. ఆమె భర్త వ్యక్తుడయినా, తండ్రి చాటు బిడ్డడే. తండ్రిని వ్యతిరేకించి ఏమీ చేయలేడు, పలుకయినా ఆడలేడు. తండ్రి శివారెడ్డి గొప్ప భూస్వామి అయినా, పక్క రైతు యొక్క పొలం ఒక అయిదెకరాలు దురాక్రమణ చేసుకుంటాడు. అంతేకాదు, కోర్టులదాకా వెళ్లి తను చేసింది చట్టపరంగా న్యాయమేనని లోకానికి ఋజువు చేసుకోగలుగుతాడు. దగాపడిన రైతు అసహాయుడయిపోయి, మరే దిక్కు తోచక తనకు అన్యాయం చేసినవాడిని శపిస్తూ వుండడమే రోజువారీ కర్తవ్యంగా కాలక్షేపం చేస్తూ వుంటాడు. ‘ఊరివారి బిడ్డను నగరివారు కొడ్తే, నగరి వారి బిడ్డను నారాయణుడు కొట్టకుండా వుండడు. విషపల్లు ముండావాడిని నేను. నా శాపం ఊరికే పోదు. ఆ యింట దీపం నిలవదు, ఆ వంశం వృద్ధికాదు’ అనేవి అతని మాటలు.
శివారెడ్డికి రుూ శాపం తగిలిందో లేదో మనం నిర్థారించలేకపోవచ్చును కాని- పైకి కనిపిస్తున్న వివరాలు ఏమిటంటే... ‘అయిదేళ్లు కాపురం చేస్తూ వున్న పెద్దకొడుకు, కోడలు (సుమిత్ర)కు ఇంకా సంతానం కలగలేదు. వంశం నిలవకుండా పోతుందేమోనని భయం మనసంతా ఆక్రమించుకుంది. ఇంతతో చాలక, రెండో కొడుకుకు పెళ్లి చేస్తే వాడు భార్యతో కాపురం చేయకపోగా, ‘నాకు ఇష్టం లేని పెళ్లి చేశావు. నేను ఇంటికి రాను’ అని వైదొలగిపోయాడు. శివారెడ్డికి మనసును కదిపేస్తున్న సమస్యలు, పరిష్కారం తోచక జ్యోతిషం వైపు దృష్టి సారించే వ్యవహారాలు! సుమిత్ర చొరవ చేసుకుని రుక్మిణి తండ్రిని కలుసుకుని రుూ వ్యవహారమంతా కనుక్కోగలుగుతుంది. అన్యాక్రాంతం చేసుకున్న భూమిని ఎలాగయినా వాళ్లకు తిరిగి ఇప్పించేసి, రుక్మిణి జీవితంలో మళ్లీ ‘వసంతం’ వచ్చేట్లుగా చేయాలని సంకల్పించుకుంటుంది. శివారెడ్డి, తమ కుటుంబ జ్యోతిష సిద్ధాంతిని ఇంటికి పిలిపించుకుని, కుటుంబంలో ఏర్పడిన రుూ సంకటాలు అన్నింటికీ కారణం చెప్పడం కాకుండా- పరిష్కారం చెప్పమని, అందుకు అవసరమయిన రంగం అంతా తీర్చిదిద్దమని కోరుకుంటాడు. ఆ జ్యోతిషుడిని ప్రత్యేకంగా కలుసుకుని, ఆయన చేతనే పరిష్కారంగా ‘్భదానం’ చేయమని సలహా సూచిస్తుంది. భూదానం ఏదో కాకుండా, అన్యాక్రాంతం చేసుకున్న భూమి- ఆ అన్యాక్రాంతానికి బలి అయిన రైతుకే దానిని తిరిగి ఇచ్చివేయడం అనే పథకాన్ని రూపకల్పన చేస్తుంది. భర్త, జ్యోతిష సిద్ధాంతుల సహకారంతో రుూ పనిని చక్కగా నెరవేర్చగలుగుతుంది. ‘మీరు మా కుటుంబానికి శ్రేయోభిలాషులు. ఈ సాయం చేస్తే మరొక కుటుంబాన్ని నిలబెట్టినవాళ్లవుతారు కూడా..’ అని సిద్ధాంతిగారి ఆమోదం కూడా తేలికగా సమకూర్చుకుంటుంది. శ్రీ రాజారాంగారు వృత్తిరీత్యా స్కూల్ మేష్టర్. మొదటి రోజుల్లో ఆయన ఎక్కువగా బడిపంతుళ్ల జీవితాలను గురించే కథలు అల్లేవారు. ఆయన వ్రాసిన మొదటి కథా సంపుటం - ‘తాను వెలిగించిన దీపాలు’ (అదీ గోధా గ్రంథమాల ప్రచురణే) ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం సంపాదించుకుంది. తరువాత రోజులలో తమ రచన పరిధిని వాతావరణాన్ని విస్తృతపరచుకుని రాజారాంగారు కథా వ్యాసంగాన్ని ఒక మహాయజ్ఞంగా జీవితం గడిపారు. కేంద్ర సాహిత్య ఎకాడమీ బహుమానాన్ని కూడా కైవశం చేసుకోగలిగారు. కథలకు పెద్దదిక్కుగా, దిక్సూచిగా, దర్శకుడుగా అనేక గొప్ప కథలను రచించారు. ఎన్ని రచనలు చేసినా, ఎంత వ్యాస వ్యాసంగం చేసినా ‘కాటుక కంటి నీరు’ అనే రుూ కథ, దేశ సంస్కృతిని-ఆచార వ్యవహారాలను సమూలంగా గుర్తుచేసే ఒక కళిక. ఇలాంటి దీపాలు ఎన్నో ఆయన వెలిగించారని వేరుగా చెప్పనక్కరలేదు, అది దేశ వ్యాప్తమయిన విషయమే!

- విరించి, 9444963584