రాష్ట్రీయం

పొలాలిచ్చాం..స్థలాలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 29: మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సు నిర్వహించేందుకు శుక్రవారం ఐనవోలు వచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణాలకు భూములిస్తే మంచి జరుగుతుందని భావించి గ్రామంలో 100 శాతం పొలాలు ఇస్తే ప్రస్తుతం రహదారుల పేరుతో నష్టం కలిగిస్తే ఒప్పుకునేది లేదన్నారు. పొలాలు ఇచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరగదని హామీ ఇచ్చిన మంత్రులు మళ్లీ కనిపించకుండా, ప్రస్తుతం వచ్చి మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. గ్రామకంఠాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకుండా ముందుకు పోవటంపై రైతులు మండిపడ్డారు. పొలాలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా స్థలాలు కేటాయించకుండా, రహదారుల కోసం ఉన్న ఇళ్లు ఖాళీ చేయమంటే ఎక్కడి పోతామంటూ ప్రశ్నించారు. గ్రామస్థులు 100 శాతం భూములిచ్చినప్పుడు గ్రామాభివృద్ధికి 20 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన మంత్రి నారాయణ ఇంతవరకు హామీ నెరవేర్చలేదంటూ రైతులు నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదని, అయితే భూములు మాత్రం తీసుకుంటున్నారని, ఇలాగే కొనసాగితే తమ పొలాలను దున్ని మరలా పంటలు వేసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ సిఆర్‌డిఎ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ముందుకు వెళ్లితే రైతులకు నచ్చజెప్పేందుకు ఇటువంటి ఇబ్బందులే వస్తాయంటూ మంత్రులతో అన్నారు.
రైతులతో బాధ్యతాయుతంగా అధికారులు వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో నేతల వలన సమస్యలు వస్తున్నట్లు రైతులు వ్యాఖ్యానించటంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటామన్నారు. వారం రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశానికి సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్ రాకపోవటంపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమావేశానికి హాజరు కావాలంటూ ఆదేశించారు.

రైతుల సమావేశంలో మాట్లాడుతున్న ఏపి మంత్రి నారాయణ