Others

విడిగా ఉండటమే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో విడిగా జీవించే జంటలు రాను రాను అధికమవుతున్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లయినా.. ప్రేమ పెళ్లయినా పదికాలాల పాటు పచ్చగా ఉండటం లేదు. వెయ్యి పెళ్లిళ్లు జరిగితే అందులో ఒక జంట విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నదని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంట్లో తమకు ఏమాత్రం సంతోషం అనేది కరువైతే వెంటనే విడాకులకు దరఖాస్తుచేసుకోవటం నేడు ఫ్యాషన్‌గా మారిపోయింది. ప్రేమ స్థానంలో పరస్పర ద్వేషానికి, అనుమానం, అవిశ్వాసానికి లోనవుతూ వారి కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఇవి హింసాత్మక సంఘటనలకు దారితీస్తాయి. అలాగే కొందరికి తెల్లారేపాటికి ధనవంతులైపోయి.. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఆలోచన పాత బంధాలను తెంపేస్తుంది. ఇలాంటి మానసికి ప్రవృత్తి అక్రమ సంబంధాలకు దారితీసి హత్యలకు సైతం వెనుకాడని పరిస్థితులకు దారితీస్తుంది. దీనివల్ల ఆత్మీయానుబంధాలు ఏహ్యంగా మారిపోతున్నాయి. మన దేశంలో ఏటా 1.36 మిలియన్ల మంది విడాకులు తీసుకుంటున్నారు. అంటే పెళ్లి చేసుకున్నవారిలో దాదాపు 0.24శాతం, మొత్తం జనాభాలో 0.11శాతం ఉంది. అంతర్జాతీయంగా 71 దేశాలలో విడాకులు తీసుకునేవారిపై అధ్యయనం చేయగా జార్జియాలో 0.46శాతం మంది విడాకులు పొందుతున్నారు.