Others

ఆషాఢంలో అల్లుడెందుకు రాకూడదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆషాఢం అనారోగ్య మాసం అని మనందరికి తెలుసు. విపరీతమైన ఈదురుగాలులతో పుల్లచినుకులు పడే సమయం. కాలువలోను, నదులలోను ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది. పొలం పనులన్నీ ఈమాసంలోనే మొదలు పెడుతారు రైతులు. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరునెలల కాలం అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయ పనులు చేయాల్సిన యువకులు అత్తవారింట్లో కూర్చోని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు జరిగేవికావు. వర్షాలకు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దారిద్య్రంతో బాధ పడాల్సిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి, అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదు అనే నియమం విధించారు పెద్దలు. అంతేకాకుండా అనారోగ్యమాసం ఆషాఢం. విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్ర్తిలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలోను, అశుభ సమయాలలోను గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం. ఇన్ని కారణాల వల్ల ఆషాఢమాసాన్ని కొన్ని పనులకు నిషిద్దం చేశారు మన పెద్దలు.

-హెచ్.ఉమాశంకర్