ఫోకస్

చట్టాల అమల్లో చిత్తశుద్ధి ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువత మత్తువైపు మళ్లకుండా చూసేందుకు కఠినమైన చట్టాలు అవసరం. ఇప్పటికే ఉన్న చట్టాల అమల్లో యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. తాత్కాలిక ఆనందంకోసం విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులవుతున్నారు. వీరి బలహీనతను ఆసరా చేసుకుని స్మగ్లర్లు, ఇతర సంఘ విద్రోహ శక్తులు తమ వ్యాపారాన్ని, అవసరాలను తీర్చుకుంటున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత వీటిని సంపాదించడం కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇంట్లో తల్లిదండ్రులు ఇస్తున్న స్వేచ్ఛ వారిని చెడుమార్గం వైపు మళ్లిస్తోంది. కార్పొరేట్ కళాశాలల్లో విద్య, చేతినిండా డబ్బు వీరిని దుర్వ్యసనాల వైపు మళ్లిస్తోంది. ర్యాగింగ్, మాదకద్రవ్యాల వినియోగానికి సంబందించి పటిష్ఠమైన చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమల్లో మాత్రం చిత్తశుద్ధి కొరవడుతోంది. తప్పు చేసినా తప్పించుకోవచ్చన్న భావన పెరిగిపోయింది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటూనే, మద్యం దుకాణాలకు అనుమతులిస్తున్నాం. ఇది కూడా ఒక విధంగా దుర్వ్యసనాలకు బీజం వేస్తోంది. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జీవితాలు గాడితప్పుతాయని, పట్టుబడితే చట్టం నుంచి తప్పించుకోలేరన్న వాస్తవం అందరికీ తెలియాలి. అలాగే మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రించే విషయంలో భద్రత కట్టుదిట్టం చేయాలి. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు కొంతమంది చెడుస్నేహాల ఉచ్చులో చిక్కుకుని, పెడత్రోవ పడుతున్నారు. వార్డెన్లు కొంతమేర ఈ దుష్ట సంస్కృతిని అడ్డుకుంటున్నప్పటికీ, వారికి సైతం తెలియకుండా జరిగే చర్యలు అప్పుడప్పుడు వెలుగుచూస్తూ సమాజాన్ని సవాలు చేస్తున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎదురయ్యే దుష్ప్రభాలను యువతకు వివరించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ దిశగా యువతను తీర్చిదిద్దినప్పుడే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనడంలో సందేహం లేదు.

ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వర రావు రిజిస్ట్రార్, ఆంధ్రా యూనివర్శిటీ