ఫోకస్

నాగరికత పేరుతో వింత పోకడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగరికత పేరుతో అనేక వింత పోకడల కారణంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారు. ఇది చాలా దురదృష్టకర పరిణామం. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటివి విద్యార్థులు పెడతోవ పట్టేందుకు దోహదపడుతున్నాయి. ప్రపంచీకరణ ప్రభావం, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం వంటి పరిణామాలు ఇటువంటి విపరీత పోకడలకు కారణమవుతున్నాయి. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం బాధ్యత కూడా ఉందనే చెప్పాలి. యువత డ్రగ్స్ బారిన పడకుండా ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులు, సంరక్షకులు సైతం ప్రత్యేక దృష్టి సారించాలి. ముఖ్యంగా విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి అవసరం. కాకినాడ జెఎన్‌టియు విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 300 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇటువంటి అతిపెద్ద విశ్వవిద్యాలయం పరిధిలో డ్రగ్స్ సమస్య పరిష్కారానికి తగిన కార్యాచరణ సిద్ధం చేయాలి. వర్సిటీ లీడర్‌షిప్ ఇందుకు నడుం బిగించాలి. ఒక్క పాఠాలు బోధించడమే కాకుండా, డ్రగ్స్ నిరోధానికి సెమినార్లు నిర్వహించడం, పోలీసులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సామాజిక శాస్తవ్రేత్తలు, మేధావులు, వైద్య నిపుణులు తదితరులచే ఇందుకు అవసరమైన వ్యూహ రచన చేయాలి. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో డ్రగ్స్ సమస్య తీవ్రస్థాయికి చేరింది. డ్రగ్స్ కారణంగా పంజాబ్ రాష్ట్రంలోని యువత భ్రష్టుపట్టిపోయింది. ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని దేశాలలో పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. డ్రగ్స్ సమస్యపై ఫలానా అని కాకుండా అన్ని వర్గాలవారూ అప్రమత్తం కావాలి. ఇందుకు విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు కీలక భూమిక పోషించాలి.

కల్నల్ ఆచార్య అల్లం అప్పారావు పూర్వ వైస్ ఛాన్సలర్ జెఎన్‌టియు, కాకినాడ