ఫోకస్

తల్లిదండ్రులు, టీచర్లదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల జీవితాన్ని మలిచే బాధ్యత ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంటుంది. విద్యార్థులపై సామాజిక అంశాలు చాలా ప్రభావం చూపిస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు మత్తుమందుకు, తాగుడు తదితర అలవాట్లకు లోనుకావడం తక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఏ విధంగా నడుచుకుంటున్నారో వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల యజమానులకు తెలిసిపోతుంది. పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులు చదుకునేందుకు ఎన్ని అవకాశాలు ఉంటాయో, చెడిపోయేందుకు కూడా అనే్న అవకాశాలుంటాయి. మత్తుపదార్థాలకు అలవాటు పడ్డ విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పును సులువుగా పసిగట్టవచ్చు. కొద్దిగా నిఘాపెడితే ఏం జరుగుతుందన్న విషయం తేలిపోతుంది. విద్యార్థుల స్నేహితులు ఎలాంటివారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. మంచి సహవాసం, స్నేహితులు ఉంటే ఫరవాలేదు, చెడుగుణాలు ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తే చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థుల పట్ల చిన్నతనం నుండే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. విద్యార్థులపై చదువుకోసం ఎక్కువ వత్తిడి తీసుకురావద్దు. వారికి ఇష్టమైన సబ్జెక్టుల్లోనే ఉన్నత చదువులు చదివే అవకాశాలు కల్పించాలి. మారుతున్న కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సెకండరీ విద్యాస్థాయిలోనే వైద్యం, ఆరోగ్యం, శాస్తవ్రిజ్ఞానం, అంతరిక్ష విజ్ఞానం తదితర అంశాల్లో కనీస పరిజ్ఞానం లభించేలా సిలబస్ ఉండేలా ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. తద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తుకు మార్గం వేసుకునే అవకాశాలు ఉంటాయి. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఎక్కువగా ఉంటుంది.

వలిపె వెంకటేశ్వరరావు విద్యారంగ నిపుణులు