ఫోకస్

మాఫియాపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రగ్ మాఫియా దేశానికి చీడపురుగు. యువతను నిర్వీర్యం చేస్తోంది. కఠినమైన చట్టాలు తెచ్చి మాదకద్రవ్యాల అమ్మకాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాలి. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్ మాఫియాను చూస్తే ఆందోళన కలుగుతోంది. పాఠశాల విద్యార్థులు, టీనేజి కుర్రాళ్లు మొదలుకుని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ఐటి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, సినీ పరిశ్రమకు చెందినవారు మాదకద్రవ్యాలకు బానిసైనట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, వైద్య శాఖ, యువజన సంక్షేమ శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసి డ్రగ్స్ బారిన పడిన యువత సరైన దారిలో నడిచేటట్లు చర్యలు తీసుకోవాలి. వారికి కౌనె్సలింగ్ ఇవ్వాలి. వారిని ప్రేమతో దగ్గరకు తీసుకుని డ్రగ్స్‌వల్ల వచ్చే చెడును వివరించాలి. అంతేకాని డ్రగ్స్ బారినపడిన యువతను బెదిరించడంవల్ల ఉపయోగంలేదు. వారు మరింత నిరాశ నిస్పృహలకు లోనవుతారు. డ్రగ్ మాఫియాకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలి. పోలీసు, ఎక్సైజ్ శాఖలు, కాలేజి యాజమాన్యాలు ఉమ్మడిగా పనిచేయాలి. పాత నేరగాళ్ల కదలికలపై దృష్టి పెట్టాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం డ్రగ్ మాఫియా. అంతర్జాతీయంగా ఈ వ్యాపారానికి నెట్‌వర్క్ ఉంటుంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలీసులు కలిసి పనిచేయాలి. ఇకపోతే తల్లితండ్రులు కూడా తమ పిల్లలకు అడిగినంత డబ్బు ఇచ్చి వారి బాగోగులను పట్టించుకోవడం లేదు. దీనివల్ల తీవ్రమైన అనర్థాలు కలుగుతున్నాయి. వారికి మంచి ప్రేమను అందించాలి. అదే సమయంలో వారికి జీవితపై భరోసా ఇవ్వాలి. అంతేకాని పిల్లల పట్ల కఠినంగా ఉండరాదు. తాము చెప్పినట్లుగా నడుచుకోలేదని పిల్లలను నిర్బంధానికి గురిచేయరాదు. వారిలో మానసిక ఉల్లాసం కలిగించేందుకు చర్యలు తీసుకోవాలి. పిల్లలు దర్వ్యసనాల బారినపడకుండా పెద్దలు అప్రమత్తతతో ఉండాలి.

విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత ఆంధ్రప్రదేశ్