ఫోకస్

చిత్తవుతున్న యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరదాగా మొదలయ్యే మత్తు పదార్థాలు, ఆల్కహాల్, గుట్కా, సిగరెట్, కొకైన్, గంజాయి, నిద్రమాత్రలు వంటి వాటికి క్రమేణా అలవాటు పడి చివరికి ఆ పదార్థాలు అందకపోతే కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేక, చివరకు బతకలేని స్థాయికి చేరుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిస కావడంతో ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి మరణిస్తున్నాడు. మాదక ద్రవ్యాలతో జీర్ణకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలు, మగవారిలో నపుంసకత్వం, ఆడవారిలో అబార్షన్లు, అంగవైకల్యం గల పిల్లల జననం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, కుటుంబ కలహాలు, యాక్సిడెంట్లు లాంటివి చోటుచేసుకుంటూ అనేకమంది మంచాన పడుతున్నారు తప్ప ఈ మత్తు పదార్థాల వ్యసనం నుంచి బయట పడటం లేదు. మత్తు పదార్థాలకు బానిసైన వారిలో యువతే అధిక సంఖ్యలో ఉండటం అత్యంత బాధాకరమైన విషయం. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు కారణం మత్తు పదార్థాలే. వీటి కారణంగానే ఎంతో అభివృద్ధిని సాధించాల్సిన సమాజం అనాగరికత వైపు పయనిస్తోంది. మద్యం మత్తులో మృగాలుగా ప్రవర్తించి వారి జీవితాలను నాశనం చేసుకోవడంతోపాటు పక్కవారి భవిష్యత్‌ను కూడా పాడుచేస్తారు. మత్తుకు బానిసైన వారిని దానినుంచి బయటపడే మార్గాలను చూపించి వారి జీవితాలను నిలబెట్టి నిజమైన మిత్రులనిపించుకోవాలి. దేశ ప్రగతిలో యువత స్థానం అత్యంత కీలకమైనదని, దానిని అంతర్యుద్ధం మాదిరిగా మత్తు పదార్థాలు కబళించి వేస్తున్నాయి. నేడు అనేకచోట్ల ఉక్కు నరాలతో ఉండాల్సిన యువత మత్తు పదార్థాల కారణంగా పీనుగుల్లా మారిపోతున్నారు. వారిని సన్మార్గంలో నడపాల్సిన బాధ్యత కూడా మనందరిపై వుంది. ముఖ్యంగా క్రైమ్ రేటు పెరగడానికి కారణం మత్తు పదార్థాలే. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, అనారోగ్యాలు వీటిలో కీలక పాత్ర పోషిస్తూ మావన జీవన విధానానికి ఆటంకంగా మారింది. దీనినుంచి యువత బయట పడాలి. అందుకు అందరూ కలిసి పనిచేయాలి. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఉన్నత విద్యను పూర్తి చేసుకుని ఉన్నతంగా జీవిస్తూ ముందుకు సాగాలి.

- ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు వైస్ ఛాన్సలర్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమహేంద్రవరం.