ఫోకస్

అప్రమత్తం చేసే పాఠ్యాంశాలుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టం గురించి, అనర్థాల గురించి విద్యార్థులను అప్రమత్తం, చైతన్యవంతం చేసేలా పాఠ్యాంశంలో చేర్చాలి. ఇంతకాలంగా డ్రగ్స్ రాకెట్స్ విద్యార్థులను, యువతను పెడదారి పట్టిస్తున్నా, వారిని దీనికి బానిసలుగా చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారించింది. ఏదైనా ఒక అంశం అనుకోకుండా ఏదో రకంగా వెలుగులోకి వస్తే తప్ప ప్రభుత్వం హడావుడి చేస్తుందే తప్ప స్వతహాగా తీసుకున్న చర్యలేమీ లేవు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, సిఐడి తదితర నిఘా సంస్థలన్నీ ఏమి చేస్తున్నట్లు? లోగడ గ్యాంగ్‌స్టర్ నరుూం కేసు అనుకోకుండా బయటపడిందే తప్ప ప్రభుత్వం సాధించిన ఘన విజయమేమీ కాదు. అప్పటివరకు ఇంటెలిజెన్స్ నిఘా ఏమైంది? కాబట్టి ఉన్నత పాఠశాల విద్యార్థులకు అంటే కనీసం 9వ తరగతికి చేరుకునే సరికే ఇటువంటి దురలవాట్లకు దూరంగా ఉండేలా వారిని చైతన్యవంతం చేసేలా పాఠ్యాంశం ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులపైనా బాధ్యత ఉంటుంది, కానీ కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావడం, మరి కొన్ని నిరుపేద కుటుంబాల్లో తల్లిదండ్రులు కూలీకి వెళుతుండడం వల్ల పిల్లలపై శ్రద్ధ చూపించకపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ‘గురుబ్రహ్మా’ అయిన ఉపాధ్యాయులే విద్యార్థులను సన్మార్గంలో నడిపించేందుకు శ్రమించాలి. విద్యార్థులకు విద్యతో పాటు దేశ హితంకోసం, సమాజ సేవ, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం, దురలవాట్లకు దూరంగా ఉండడం, కుల మతాలకు అతీతంగా కలిసి జీవించడం వంటి మంచి అలవాట్లను నేర్పించాలి. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో, నగర శివార్లలో పెరుగుతున్న ‘పబ్’ కల్చర్ ఆందోళన కలిగిస్తున్నది. మద్యం, మత్తుపదార్థాల వాడకం వల్ల వారి శరీరాలు దెబ్బతినడమే కాకుండా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. యువత పెడదారిని పడుతున్నా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చోద్యం చూస్తున్నారు. రాజకీయ విమర్శలు ఏవైనా వస్తే వెంటనే స్పందించే ముఖ్యమంత్రి ఇంత తీవ్రమైన అంశంపై ఎందుకు మాట్లాడడం లేదు. బోనాలు, బతుకమ్మ సంబురాల్లో పాల్గొనే నిజామాబాద్ ఎంపి కవిత ఈ విషయంలో విద్యార్థులను, యువతను చైతన్యవంతం చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి? మత్తుపదార్థాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలి, అందుకే వారిని అప్రమత్తం, చైతన్యవంతం చేసేందుకు పాఠ్యాంశంగా చేర్చాలి.

- రమ్యా రావు రేగులపాటి అధికార ప్రతినిధి, టి.పిసిసి