ఫోకస్

క్రీడల పట్ల ఆసక్తిని పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీనేజిలో విద్యార్థులు దురలవాట్లకు గురికాకుండా ఉండాలంటే వారికి క్రీడలపట్ల ఆసక్తిని పెంచాలి. కొన్ని విద్యాసంస్థల్లో పర్యవేక్షణ కొరవడటం వల్ల విద్యార్థులు దురలవాట్లకు గురవుతున్నారు. పర్యవేక్షణ తక్కువగా ఉన్న విద్యా సంస్థలు విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదునివ్వాలి. క్రీడా సదుపాయాలుంటే విద్యార్థులు దురలవాట్లకు గురికాకుండా క్రీడల వైపు మళ్లే అవకాశం ఉంది. సాధారణంగా ప్లస్2 విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో, ఇళ్లలో చదువుకుంటారు. గ్రూపులుగా ఉండి పోటీగా చదువుతూ మంచి ర్యాంకులు సాధిస్తున్న మాట వాస్తవమే. ఏ విద్యార్థులైతే చదువుపై తక్కువ దృష్టి పెట్టి తీరికవేళల్లో సమయాన్ని వృధా చేస్తుంటారో అలాంటి విద్యార్థులపై పర్యవేక్షణ ఎక్కువగా ఉండాలి. ఒకవైపు తల్లిదండ్రుల నుంచి, మరోపక్క ఆయా విద్యా సంస్థల నుంచి పర్యవేక్షణ ఉంటే విద్యార్థులు దురలవాట్లకు గురికాకుండా కాపాడుకోవచ్చు. ఏదేని విద్యా సంస్థలో ఒకరిద్దరు విద్యార్థులు చెడు అలవాట్లకు లోనైన వారితో ఫ్రెండ్‌షిప్ చేయడంవల్ల ఇతరులు కూడా పొగతాగడం, మత్తు పదార్థాలకు అలవాటుపడే ప్రమాదం ఉంది. అలా అలవాటు పడిన వారిని వెనక్కి తీసుకురావడం కష్టం. అందువల్లనే పిల్లలను ఎప్పటికపుడు మోనిటరింగ్ చేస్తుండాలి. కళాశాలల్లో కూడా విద్యార్థులు ఏం చేస్తున్నారన్న దానిపై దృష్టిసారించాలి. మంచి ఇనిస్టిట్యూట్‌లో చేరిన విద్యార్థులకు ఖాళీ సమయం లేకుండా అసైన్‌మెంట్స్ ఇవ్వడం వల్ల వారికి తీరికలేక చదువుపైనే దృష్టి సారిస్తుంటారు. దురలవాట్లకు గురికాకుండా ఉండేందుకు ప్రతి నెల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పొగ తాగడం, మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయన్నదానిపై వారికి అవగాహన కల్పించాలి. విద్యార్థులకు అవగాహన కల్పించగలిగితే దురలవాట్లకు గురికాకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థుల దృష్టిని క్రీడలపైకి మరల్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయ.

ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు వైస్ ఛాన్సలర్, సెంచూరియన్ వర్శిటీ