ఫోకస్

డ్రగ్స్ రహితంగా మారుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్ మాఫియా డొంక కదిలింది.. గుట్టుచప్పుడు కాకుండా సాగుతోన్న ఈ వ్యవహారంలో దోషులెవరైనా.. ఎంతటివారైనా, ఎవరినీ వదిలిపెట్టం. ఇప్పటికే డ్రగ్స్ సరఫరా చేస్తున్న 16 మందిని అరెస్టు చేశాం. డ్రగ్స్ సరఫరా చేసేవారిలో సినీ పరిశ్రమకు చెందినవారు కూడా ఉన్నారు. డ్రగ్స్ సరఫరా ముఠాకు చెందిన రెండు వెబ్‌సైట్‌లను కూడా గుర్తించాం. ఇప్పటికే నాలుగు ముఠాలుగా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న పది మందిని సిట్ విచారిస్తోంది. మరో 18 ముఠాల కోసం గాలిస్తున్నాం. ఇటీవల సికిందరాబాద్‌లో పట్టుబడిన కెల్విన్‌కు ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు దిగుమతి అయ్యే డ్రగ్స్ గోవానుంచి సరఫరా అవుతున్నట్టు విచారణలో తేలింది. కెల్విన్, నిఖిల్ శెట్టితో గోవానుంచి డ్రగ్స్ తెప్పించేవాడు. ఈ డ్రగ్స్‌ను పాఠశాల విద్యార్థులకు, హోటళ్లకు, సినీ నిర్మాతలకు ఒక్కొక్కరికి ఒక్కో డిస్ట్రిబ్యూటర్‌ను ఏర్పాటు చేసుకొని సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న ఐటి కంపెనీలకు, 26 స్కూళ్లు, 27 కళాశాలలకు నోటీసులు జారీ చేశాం. హైదరాబాద్‌లో సుమారు వెయ్యి మందికిపైగా ఈ కేసుతో సంబంధం కలిగివున్నారు. ప్రధాన నిందితులను అరెస్టు చేశాం. వారినుంచి నార్కొటిక్ ఎల్‌ఎస్‌డి, ఎల్‌ఎండిఏ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. విద్యార్థుల్లో వచ్చే మార్పులను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనించాలి. తోటి స్నేహితుల ఒత్తిడి, ఇంట్లో ఒంటరితనం వల్ల కొందరు పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగరూకతతో ఉండాలి. ఇకపై హైదరాబాద్‌లో డ్రగ్ మాఫియా ఆగడాలు కొనసాగనివ్వం. భవిష్యత్తులో డ్రగ్స్హ్రిత హైదరాబాద్ నగరంగా చూస్తారు. ఈ వ్యవహారంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. కేసుతో సంబంధాలున్న ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఎంతటివారినైనా వదిలిపెట్టం. కేసులు నమోదు చేస్తాం.

అకున్ సబర్వాల్ ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ తెలంగాణ