ఫోకస్

మత్తు.. జీవితాలు చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయంగా వస్తున్న వ్యాపార ధోరణులు వివిధ రంగాల్లోకి కంటికి కనిపించని రీతిలో చొచ్చుకు వచ్చి అవి అసాంఘిక కార్యకలాపాలకు బీజం వేస్తున్నాయి. మద్యం విపరీతంగా అమ్ముడుపోవడం, పొగాకు వినియోగం, నీలిచిత్రాలు, డ్రగ్స్ (మాదకద్రవ్యాల) వినియోగం ఇలా చెప్పుకుంటూపోతే అదో పెద్ద చేంతాడంత ఉంటుంది. గోప్యంగా ఇంతకాలం జరిగిన డ్రగ్స్ వినియోగం అంచెలంచెలుగా సినిమా పరిశ్రమ నుండి ఇటు విద్యారంగానికి సోకింది. ఉన్నత విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారనే ఆరోపణల స్థాయినుండి నేడు పాఠశాలలకు సైతం సోకింది. ఈ పరిస్థితికి కేవలం వ్యాపారతత్వమే కారణమా? విద్యారంగంలో పెడధోరణులు కారణమా? సరళీకృత ఆర్థిక సంస్కరణలు కారణమా? సమాజంలో వేగంగా వస్తున్న మార్పులు కారణమా? దీనికి ఎవర్ని తప్పుపట్టాలి? తెలంగాణలో వివిధ విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు వివరాలను బట్టబయలు చేయడంతో అంతా దిగ్భ్రాంతి చెందారు. ఇలా పేర్లు బయటకు రాని విద్యాసంస్థలు ఈ జాబితాలో ఎన్ని ఉన్నాయో మున్ముందు అందరికీ తెలుస్తుంది. పదివేల మంది చదువుకునే విద్యాసంస్థలో ఒకరిద్దరు చేసే తప్పునకు మొత్తం విద్యాసంస్థనే తప్పుపట్టడం సబబా అంటే.. ఒకరిద్దరు కూడా తప్పు చేయడం తప్పుగా ఎందుకు చూడకూడదనే సమాధానం కూడా వస్తుంది. ఒక్కరైనా ఎందుకు తప్పు చేయాలి? అంతా బిజీ జీవితాల్లో మునిగి తీవ్రమైన ఉద్రిక్తతకు, ఉద్వేగానికి గురై ఒత్తిడితో పనులు చేసుకోవడం అనారోగ్యానికి దారితీస్తోంది. సరైన ప్రణాళిక, ముందుచూపు లేకపోవడంతో ఒత్తిడికి గురవుతున్న వారు మనసు కుదుటపరుచుకోవడానికి ప్రత్యామ్నాయాలను అనే్వషిస్తున్నారు. అందులో డ్రగ్స్ కీలకంగా మారింది. ప్రైవేటీకరణ పెరిగి ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని సతమతంలో యువత అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు, చిన్న పిల్లలు సైతం ఇపుడు డ్రగ్స్ బాట పట్టడం అందరినీ ఆందోళన కలిగించే అంశం. దీనికి సమాజం, కుటుంబం, మానసిక అపరిపక్వత అన్నీ కారణమే. మానసికంగా సమర్ధులుగా ఎదగలేకపోతున్న యువత మాత్రమే ఇలాంటి తప్పుటడుగులు వేస్తున్నారు. సరైన లక్ష్యం, ఆశయంతో పనిచేసే యువత అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఒకే తరంలో ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తున్నాయి. తప్పుడుమార్గంలో వెళ్తున్న యువతను చూసి ఎవరినో నిందించే బదులు వారిని సన్మార్గంలో పెట్టేందుకు ఉన్న అవకాశాలను అనే్వషించడం ముఖ్యం. ఈ అంశంపై వివిధ రంగాలకు చెందిన నిణుపుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.