అంతర్జాతీయం

కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 12: ఓవైపు సిక్కిం సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరో పక్క కాశ్మీర్ వివాదంలో తలదూర్చడానికి తహతహలాడుతోంది. ముఖ్యగా కాశ్మీర్‌లో అధీన రేఖ వెంబడి భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోందని, అందువల్ల ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చైనా అంటోంది. భారత్, పాకిస్తాన్‌లు రెండూ దక్షిణాసియాలో చాలా ముఖ్యమైన దేశాలని, అయితే కాశ్మీర్‌లో పరిస్థితి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ షువాంగ్ బుధవారం విలేఖరులతో అన్నారు. కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఈ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఇది ఇరు దేశాలమధ్యే కాకుండా దక్షిణాసియాలో శాంతి సుస్థిరతలకు కూడా భంగం కలిగిస్తుంది అని జెంగ్ అన్నారు. అందువల్ల ఇరుపక్షాలు కూడా ఈ ప్రాంతం శాంతి సుస్థిరతలకు అనువైన మరిన్ని చర్యలుతీసుకోవడంతో పాటు ఉద్రిక్తతలు పెరిగిపోకుండా చూస్తాయని తాము భావిస్తున్నామని, ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు చైనా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు, ఇస్లామిక్ దఏశాల సహకార మండలి (ఓఐసి) కాశ్మీర్‌పై ఒక తీర్మానాన్ని ఆమోదించడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా జెంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కాశ్మీర్ సమస్య కేవలం ద్వైపాక్షిక సమస్య అని, ఇందులో బయటి వారి జోక్యం అనవసరమని భారత్ మొదటినుంచీ వాదిస్తున్న విషయం తెలిసిందే. గతంలో అమెరికా సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపినప్పుడు సైతం మన దేశం ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది.