అంతర్జాతీయం

జిబౌటిలో చైనా సైనిక స్థావరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 12: హోర్న్ ఆఫ్ ఆఫ్రికాలోని జిబౌటిలో ఏర్పాటు చేయబోతున్న తన సైనిక స్థావరం కోసం సైనికులను తీసుకొని చైనా నౌకలు మంగళవారం బయలుదేరి వెళ్లాయి. సైనికంగా విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చైనా ఈ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తోంది. హిందూమహా సముద్రం చివరి భాగంలో ఆఫ్రికా ఖండానికి చేరువలో ఉన్న అత్యంత కీలకమైన ప్రాంతమైన జిబౌటిలో ఏర్పాటు చేస్తున్న ఈ సైనిక స్థావరం చైనా విదేశాల్లో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సైనిక స్థావరం కావడం గమనార్హం. ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్ లాంటి దేశాల సముద్ర జలాల్లో పాగా వేసిన చైనా భారత్ భూభాగాలపై కూడా కనే్నసి కయ్యానికి కాలుదువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా జిబౌటిలో మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేయబోతుండడం భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. జిబౌటిలో సపోర్ట్ బేస్‌ను ఏర్పాటు చేయడం కోసం దక్షిణ చైనాలోని ఝాంగ్‌జింగ్ రేవునుంచి నౌకలు వెళ్లాయని మంగళవారం పొద్దుపోయిన తర్వాత చైనా అధికార వార్తాసంస్థ ‘జిన్హువా’ తెలియజేసింది. అయితే అధికారికంగా ఈ బేస్ ఎప్పటినుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందో ఆ కథనం తెలియజేయలేదు. జిబౌటిలో సైనిక స్థావరం నిర్మాణాన్ని చైనా గత ఏడాది ప్రారంభించింది. అయితే ఆఫ్రికా దేశాల్లో ముఖ్యంగా యెమన్, సోమాలియా ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ, మానవతా సహాయం కోసం చైనా చేపడుతున్న కార్యకలాపాలకు అవసరమైన నౌకలను సరఫరా చేయడం కోసమే ఈ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నామే తప్ప తమకు విస్తరణ కాంక్ష లేదని చైనా వాదిస్తోంది.