డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకేదయినా వెంటనే అర్థం కాక తప్పు చేస్తే ఇలాగే నేనూ తప్పు చేస్తే నువ్వు ఏమనేదానివి- నీ బుర్ర కాస్త వాడు. భగవంతుడు బుర్ర ఇచ్చింది గూట్లో పెట్టడానికి కాదు అని అంటూ తనూ అదే అనేవాడు.
నాకు కంప్యూటర్స్ వాడటం అంతా వాడే నేర్పించాడు.
వెడుతున్న కారు సడెన్‌గా ఆపేశాడు. రోడ్డు ఒక పక్కన సైడుకు కారు తిప్పి తీసుకువచ్చి- ‘‘ఇదిగో ఇక్కడే మొదటిసారి నేను తేజాని కలిశాను’’ అన్నాడు. చుట్టూ చూస్తే ఏమీ లేదు. పెద్ద రోడ్డు తప్ప. ఏదో పార్క్‌లోనో, సినిమా హాల్లో, కాలేజీ ఏదేదో చూపిస్తాడనుకుంటే ఎటువంటి ప్రత్యేకతా లేని హైవేమీద ఒక పక్క చూపించాడు.
అదే అర్థం కానట్లు వాడి వంక చూచాను.
‘‘ఇక్కడా!’’ అన్నాను.
తల ఊగించాడు.
‘‘ఒకసారి ఏమయిందో తెలుసా! ఎప్పుడూ పడనంత మంచు పడింది. అది నిజానికి నవంబరే! లాన్సింగ్‌లో ఒక ఫ్రెండ్ పార్టీకి పిలిచాడు వాడి డార్మ్‌లో ఏదో పెద్ద పార్టీ చేస్తున్నారని. నేను కూడా వెళ్లాను. మామూలుగా పార్టీలు అర్థరాత్రిదాకా సాగుతాయి. కాని, ఆ రోజు అనుకోకుండానే స్నో స్టార్మ్ రాబోతోందని తెలిసింది. అందుకే పార్టీ నుండి త్వరగా బయలుదేరాను. పార్టీకి వెళ్ళే ముందు ఆ రోజు అంత స్టార్మ్ వస్తుందన్న సూచన లేదు. రోడ్లు శుభ్రంగా ఉన్నాయి. హాయిగా వెళ్లిపోయాను. తీరా తిరిగి వచ్చేస్తుంటే మెల్లి మెల్లిగా మొదలయిన స్నో బుట్టలతో గుమ్మరించినట్లు అయిపోయింది.
చీకటి- రోడ్లు స్నోతో నిండిపోతున్నాయి.
కార్లు కదలడమే కష్టమయిపోతుంది. కేవలం ప్రాకడం మొదలుపెట్టాయి. లోపల స్టీరింగ్ పట్టుకుని గైడ్ చెయ్యడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం.
ఇంకొంచెం ముందుగా ఆలోచించి ఉంటే అక్కడినుండి అసలు బయలుదేరే వాళ్ళే కాదేమో చాలామంది. కానీ, ఇప్పుడు ఒకసారి హైవే ఎక్కాక వెనక్కి వెళ్ళగలిగే ప్రశక్తి లేదు. ముందుకు వెళ్లాల్సిందే పూర్తిగా మూసుకుపోయింది. ముందు కనిపించడమే కష్టంగా ఉంది. కేవలం ముందు పోతున్న టైల్ లైట్స్ చూస్తూ వాటి వెనక పోనివ్వడంలా అయింది.
ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి, కార్లు పూర్తిగా ఆగిపోయాయి. ఆ ముందు ఏదో కార్ స్పిన్ అయిందట. దాని ఎఫెక్ట్‌తో ఆ వెనక మరో 10 కార్లు కూడా గిరగిరా తిరిగాయట.
దాంతో మా కార్లు ఆగిపోయాయి. కేవలం కార్లో కూచుని వాతావరణం వింటున్న నాకు కొంచెం భయం అనిపించసాగింది. అసలు ఎప్పటికి చేరతానా అని.
పైనుంచి పడుతున్న స్నోతో విండ్ షీల్డ్, లైట్స్ మూసుకుపోతున్నాయి. నా ముందు కారువాడు దిగి, కార్‌మీద వున్న స్నో దులుపుకోవడం మొదలుపెట్టాడు. ఇదేదో సరయిన పనిలా ఉంది అనుకుని నేను కూడా దిగాను.
బానెట్‌మీద, రూఫ్‌మీద ఉన్న స్నో దులుపుకుంటూ కార్‌కి అవతల వైపుకు వెళ్ళాను.
అప్పుడే నోటీసు చేశాను. పక్కన లైన్ అవతల షోల్డర్ మీద ఒక కారు ఆగిపోయి ఉంది. అది స్టార్ట్ చేసి కూడా లేదు. కారుకు ఏదో ప్రాబ్లం వచ్చినట్లుంది.
స్టిరింగ్‌ముందు కూచున్నది ఓ అమ్మాయిలా అనిపించింది. ఇంతలో ఆ అమ్మాయే చటుక్కున విండో దింపింది. విండో మీద ఉన్న స్నో జారిపడిపోవాలని.
వెలుతురు మసగ్గా ఉన్నా, పరిసరాలు స్నోతో నిండేటప్పటికి ఒకరకమయిన కాంతి వెదజల్లుతోంది. ఆ కార్లో ఓ అమ్మాయి ఒక్కతే ఉందనిపించింది.
ఆ స్నోలోనే నడుస్తూ కారు దగ్గరగా వెళ్లి ‘‘ఏమయినా హెల్ప్ కావాలా’’ అని అడిగాను.
అక్కర్లేదన్నట్లు తల ఊపింది. ‘‘రోడ్డు హెల్ప్ వస్తుంది. ఫోన్ చేశాను’’ అంది.
ఈ వాతావరణంలోనా- అనుకున్నాను మనసులో.
‘‘ఏమయింది అసలు’’ అన్నాను.
సడెన్‌గా రోడ్డుమీద గుట్టలా పడి ఉన్న స్నోలోకి టైర్ స్కిడ్ అయింది. వెంటనే కాసేపట్లో కారు ఆగిపోయింది అంది.
‘‘ఇంజిన్‌లో బాగా స్నో వెళ్లిపోయి ఉంటుంది’’ యూ వాంట్ మి టు ట్రై అన్నాను.
ఒక్కసారి తల ఎత్తి చూచి- గబుక్కునకారు దిగింది. అప్పుడే నోటీసుచేశాను. ఆ అమ్మాయి భారతీయురాలనే! అప్పటిదాకా మా సంభాషణ ఇంగ్లీషులోనే సాగుతోంది.
నేను కూడా స్టార్ట్ చెయ్యాలనే ప్రయత్నం చేశాను కానీ ఫలించలేదు.
‘‘ఈ వాతావరణంలో రోడ్ హెల్ప్ రావడం చాలా టైం పడుతుంది. నేను ఎక్కడన్న డ్రాప్ చేస్తాను, రండి’’ అన్నాను. ఆ అమ్మాయి తల అడ్డంగా ఊగించింది. ‘‘్ఫరవాలేదు. రోడ్ హెల్ప్ కోసమే వెయిట్ చేస్తాను’’ అంది.
‘‘చాలా టైం పట్టేస్తుందేమో ’’ అన్నాను.
‘‘్ఫరవాలేదు’’ అంది. నా కారు వైపు చూస్తూ!
నేన్కొడినే డ్రైవ్ చేసుకు వెడుతున్నాను. ఆ అమ్మాయి వంటరిగా ఉన్న నాతో కారు ఎక్కడానికి సందేహిస్తోందని అనిపించింది.
‘‘రండి.. దగ్గరగా ఉన్న హోటల్ కానీ, రెస్టారెంట్ గాని దింపేస్తాను’’ అన్నాను.
వద్దనట్లు మళ్లీ తల ఊగించింది. ఇంతలో కార్లకి కొంచెం చలనం వచ్చింది. వెనకవాళ్ళు అసహనంగా హార్న్ మోగించారు. రోడ్డుమధ్యలో నా కారు ఆపి ఉంది.
గబగబా వెళ్లాను నా కారు పోనివ్వడానికి. ఆ అమ్మాయి తన కారు ఎక్కి తలుపు మూసుకుంది. వెదర్ చూస్తే దారుణంగా ఉంది. ఆ అమ్మాయి ఒక్కతే ఉండిపోయింది. పైగా ఇంజిన్ కూడా స్టార్ట్ అవడంలేదు. కాసేపట్లో కారు బాగా చల్లబడిపోతుంది కూడా.
కారులోకి ఎక్కుతూ ‘‘రండి, ఫరవాలేదు’’ అన్నాను.
అటువైపునుంచి ఎటువంటి చలనమూ రాలేదు.
‘‘పోనీ మీరే డ్రైవ్ చేయండి. నాకు అభ్యంతరం లేదు’’ అన్నాను.
వెనక కార్లు తొందర పడుతున్నాయి. అలాంటి వెదర్‌లో ఆ అమ్మాయిని అలా వదిలేయడం కొంచెం అన్‌కంఫర్టబుల్‌గానే ఉంది.
తెల్లారి లేస్తే ఏ దేశంలో చూచినా అత్యాచారాలే! అందుకే ఇక్కడ చిన్నప్పటినుంచి అపరిచితుల కారు ఎక్కొద్దని నూరిపోస్తారు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి