మంచి మాట

నమస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమస్కారం సంస్కారాన్ని తెలుపుతుంది. పెద్దలకు పిన్నలు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవటం ఒక సత్ సంప్రదాయం పరుల్లో పరమాత్మను చూడమని చెప్పే సంస్కృతి భారతదేశానిది. భారత దేశంలో ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు అన్నింటిలోను ఒక అంతరార్థం ఉంటుంది. దాన్ని తెలుసుకొని ఆ పనిని నిర్వర్తిస్తే పనివల్ల అనుకొన్న ఫలితాన్ని పొందవచ్చు. నమస్కరించే విధానమునుబట్టి అవతలి వారి వ్యక్తిత్వమును అవగాహన చేసుకోవచ్చు.
సూర్యుడు కూడా నమస్కార ప్రియుడు. సూర్యునికి చేసే నమస్కారాల వల్ల అటు పుణ్యం రావడమేకాదు ఇటు ఆరోగ్యం కూడా చేకూరుతుంది. వ్యక్తిత్వ వికాసము, తెలివితేటలు, ఆలోచనలు పెరగటానికి నమస్కారము ఒక బాణం వంటిది - గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దలు, మహారాజు, అధికారులు మొదలగు వారి వద్దకువెళ్లినపుడు నమస్కరిస్తే వారి వాత్సల్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. విద్యాభ్యాసం సరిగా సాగడానికి గురువుగారికి నమస్కరించి ఆరంభిస్తే ఆయన అనుగ్రహంతో విద్యలన్నీ కరతలా మలకం అవుతాయ.
గురువుల ఆశీస్సులు, ప్రభువుల కరుణ, అధికారుల మన్ననలను కూడా నమస్కారం వల్ల లభిస్తాయ. ఇట్లా చేసేనమస్కారాలల్లో ఎన్నో విధాలున్నాయ. సాష్టాంగమనగా ‘‘శరీరములో ఎనిమిది భాగాలు నేలకు ఆనునట్లు చేయుట’’ అనేది ఒకటి దానినే సాష్టాంగ నమస్కారం అంటారు. ఉదా: ఆధ్యాత్మిక గురువులకు, ఇలవేల్పులకు నేలపైన సాపుగా పడుకొని కాళ్లు, చేతులు, మొత్తం శరీరం అంతా సరళ రేఖలా పడి నమస్కరించడమే సాష్టాంగనమస్కారం. మరలా స్ర్తిలకు, పురుషులకు ఈ నమస్కారం చేసేవిధానంలో తేడా ఉంటుంది.
ఉపాసన, పూజ చేయునపుడు పవిత్రమగు మనసుతో, పరిశుభ్రంగా మడి బట్టలతో కర, అంగన్యాసముల ద్వారా చేసే నమస్కారాన్ని ధ్యాన నమస్కారం అంటారు. మానసికంగా చేసే నమస్కారముకూడా ఒక రకమైన నమస్కారం. ఏకాగ్రతతో భగవంతుని ధ్యానించుట. మనఃపూర్వకంగా చేయునది - లేదాతన్ను తాను సమర్పణం చేసుకొనుట. ఉదా: రామకృష్ణపరమహంస కాళికాదేవిని పూజించుట, హనుమంతుడు రామునికి దాసుడవుట ఇలాంటివన్నీ కూడా మానసిక నమస్కారాల కిందనే వస్తాయ.
సర్వనదులు సాగరంలో చేరినట్టు మనుష్యుల్లో ఉండే దుష్టబుద్ధి అంతరించి సద్భుద్ధిని కలిగి చేయటంతో నమస్కారం చేసే ప్రక్రియలు తోడ్పడుతుంది.
సుగ్రీవునిపై కోపంతో లక్ష్మణుడు వెళ్లినపుడు సుగ్రీవుడు భయపడి తారను లక్ష్మణుని దగ్గరకు పంపిస్తాడు. తార లక్ష్మణునిచూచి నమస్కరించింది. ఆ తరువాత సుగ్రీవుని బలహీనతలను చెప్పి తప్పక రాముని బాటలోనే నడుస్తాడు. ఎల్లపుడూ రాముని విధేయునిగా ఉంటాడు. మీరు దయచేసి సుగ్రీవుని మానసిక స్థితి అర్థం చేసుకోండి అని చెప్పింది. అట్లా నమస్కారం చేసి చెప్పినందువల్లే లక్ష్మణునిలో ఆగ్రహం తగ్గుముఖం పట్టింది. ఆ తరువాత సుగ్రీవాదులు రామునితో కలసి నడిచి విజయలక్ష్మిని చేపట్టారు. విభీషణుడు కూడా శత్రుపక్షం నుంచి వచ్చినప్పటికీ ముందుగా రామునికి నమస్కారం చేశాడు. ఆ తరువాత తను ఎందుకు వచ్చాడో తెలిపాడు. విభీషణునిలోని సంస్కారాన్ని చూచి తన తమ్ముడి లాగా రాముడు విభీషణుడిని భావించాడు.
ద్రౌపది తనకు వస్త్రాపహరణం అనే ఆపద సంభవించినపుడు శ్రీకృష్ణుని శరణు వేడి చేతులతో నమస్కరిస్తూ తన్ను కాపాడమని కోరుకుంది. కృష్ణుడు చీరల దొంతరలను ఇచ్చి దుశ్శాసనుడే వెల్లకిలా పడేట్టుగా చేశాడు. దుష్టులు మంచిమార్గంలోకి మళ్లించడానికి నమ స్కారం కూడా ఒక ఆయుధంగా పనిచేస్తుంది.
వినయంతో ఏ పనిని అయనా సానుకూలంగా చేసుకోవచ్చు. దుసాధ్యమైన పనిని సుసాధ్యం చేసుకోవడానికి నమస్కారం పదునైన ఆయుధమే అవుతుంది. మహామహితాత్ములైన పుణ్యపురుషుల ఆశీర్వచనబలం, ఈశ్వరానుగ్రహబలం రెండూ లభించాలంటే సులభోపాయం ఇద్దరికీ నమస్కరించడమే.

- హనుమాయమ్మ