Others

చెదిరిన కల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వ్యక్తి మరణం మొత్తం కుటుంబానే్న రోడ్డున పడేస్తుంది. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల వెనుక ఎన్నో కుటుంబాల చిన్నాభిన్నమైన జీవిత చక్రాలు కనిపిస్తుంటాయి. ఇటీవలకాలంలో అతివేగం, అజాగ్రత్తవల్ల ఎందరో అసువులుబాస్తున్నారు. ప్రమాదంలో యజమాని చనిపోతే మొత్తం కుటుంబమే విషాదంలో మునిగిపోతుంది.
ప్రమాదాలు సంభవించడానికి వ్యక్తి ఎంత కారణమో వాహనం, రోడ్డు ప్రమాదాలు అంతే ముఖ్యంగా చెబుతారు. వ్యక్తి మానసిక స్థితి అతి ముఖ్యమైన విషయంగా పరిగణిస్తే, అందులో అతని కుటుంబ, ఆర్థిక, సామాజిక, మానసిక కారణాల ప్రభావం అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు.
మానసిక ఒత్తిడి: కుటుంబ ఆర్థిక, సామాజిక, ఉద్యోగ స్థాయి ఒత్తిడి సహజం. కొన్ని సం దర్భాలలో ఇది తీవ్ర స్థాయిలో వుం డొచ్చు. అధిక ఒత్తిడిలో ఆలోచన, ఉద్వే గం, అసమతుల్యతలో వుంటాయి. ఏకాగ్రత నిలపలేక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయి. ఒత్తిడి మనిషిని కుంగుబాటుకు గురిచేస్తుంది. ప్రమాద సంకేతాలను గుర్తించలేక ఇతర ఆలోచనలతో అనర్థాలకు గురవుతారు. డ్రైవింగ్‌లో వుండేవారు ప్రశాంతత కలిగివుండాలి. ఒత్తిడి స్థాయిలకు కారణాలను విశే్లషించి రిలాక్సేషన్ పాటించాలి. కుటుంబ, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాలి.
ఆందోళన: విపరీతంగా ఆందోళనకు గురయ్యేవారు శరీర సమతుల్యతను కోల్పోతారు. ప్రమాదాలు జరగబోయే సందర్భాలలో సరైన నిర్ణయం చేయలేకపోవుట, తప్పించే మార్గాలను అంచనా వేయలేకపోవడం జరుగుతుంది. ఆందోళనతో చేసే పనులు జీవితాన్ని కోల్పోయేలా చేస్తాయి. యోగ, ధ్యానం ఆందోళన తగ్గించడంలో ఉపయోగపడతాయి.
భయం: ఖాళీ ప్రదేశాల్లో వాహన చోదకుల్లో లేని భయం జన సమూహంలో కలిగివుంటారు. భయం కారణంగా వాహనంపై పట్టుకోల్పోయే ప్రమాదశాతం ఎక్కువ. వాహన చోదకుల్లో గతంలో జరిగిన సంఘటనలు, వ్యక్తిత్వంలోను, చిన్నతనంనుండి పెరిగిన రీతులు ప్రభావంతో భయం ఏర్పడుతుంది.
టైప్ ఎ వ్యక్తిత్వం: ఇటువంటి వ్యక్తిత్వం కలిగినవారు వేగంగా ఆలోచిస్తుంటారు. స్థాయికి మించిన పనులు చేయాలనుకుంటారు. దూకుడు స్వభావం ఆందోళనగా వుండటం మొదలైన వ్యక్తిత్వ లక్షణాలు వాహన ప్రమాదాలకు కారణమవుతుంటాయి.
టైం మేనేజ్‌మెంట్ లేకపోవడం: సమయానికి బయలుదేరడం, ముందుగా ప్రణాళికలు లేకపోవడం, అలసత్వం, బద్ధకం, వాయిదా వేయడం మొదలైన మనస్తత్వం కలిగినవారు ఆఖరి క్షణాల్లో బయలుదేరడం, అత్యధిక వేగపరిమితులకు అలవాటుపడటం, తద్వారా వాహన ప్రమాదాలకు కారణమవుతారు.
ఆల్కహాల్, డ్రగ్స్ అలవాట్లు: ఎక్కువగా వీటి ప్రభావం రోడ్డు ప్రమాదాలపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మెదడు శరీరం పనితీరులో అసమతుల్యత అనేది సంభవించి డ్రంక్ డ్రైవ్‌లో ఎక్కువ ప్రమాదాలకు కారణమగును. డ్రైవింగ్ అనేది ప్రతి సెకను కాలం ఏకాగ్రతతో చేయవలసినది. కాని డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకునేవారిలో ఏకాగ్రత స్థాయిలు ఎంతటివారైనా నిలిపి వుంచడం కష్టం. ఎక్కువ ప్రమాదాలు జరగటానికి ఆస్కారం వుంటుంది.
పిల్లల పెంపకం రీతులు: తల్లిదండ్రులు అతిగారాబం, ఏది కావాలంటే అది కొనిచ్చే విధానం, ఎంత ఖరీదైన వాహనాన్నయినా వారికి ఇవ్వడం. అత్యధిక సామర్థ్యం కల వాహనాలు కొనిపించి ప్రమాదాలు చేయడంతో విచ్చలవిడితనం అలవాటుగా మారుతుంది. శారీరక దారుఢ్యం కంటే అధిక బరువు వాహనాలు నడపడం, రోడ్ల స్థితిగతులు దృష్టిలో వుంచుకోకుండా రేస్ బైక్‌లు, అధిక సామర్థ్య వాహనాలుతో ప్రయాణించడంవల్లవారికే కాక పాదచారులు, ఇతర వాహనదారులకు నష్టం కలిగిస్తుంటారు. పిల్లల వ్యక్తిగత విషయాలను తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంవల్ల చెడు
స్నేహాలు, రేస్‌లు, పోటీలు ఇతరులకంటే పైచేయి అనిపించుకోవాలనే క్రమంలో ప్రమాదాలకు గురవుతారు. బహిర్గత ప్రదర్శన రీతులు, ఎగ్జిబిషనిజం: సినిమాలలో వస్తున్న వివిధ సవాళ్లు హీరో చేసే కృత్యాలు, అందరిలో చేసి నిరూపించుకోవాలనుకోవడం, ఛాలెంజ్‌లు చేయడం, అది సాధించాలనే క్రమంలో ఎన్నో ప్రమాదాలకు గురవుతారు.
సరిపోల్చుకోవడం: ఇతరులకు గల పెద్ద శ్రేణి వాహనాలు నాకు కావాలనే, పొందివుండాలనే తపన, తమ కుటుంబ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకోకుండా అసత్యపు గొప్పదనాలకు, ఫాల్స్ ప్రిస్టేజ్‌తో తల్లిదండ్రులను వేధించి వాహనాలను కొనుగోలు చేసి ప్రమాదాలకు కారణమవుతారు.

శారీరక మానసిక కారణాలు
శరీర సౌష్టవంలో వుండే మార్పులు, కొందరి కాళ్ళు పొడవుగా, చేతులు పొడవుగా మొండెం భాగం పొట్టిగాను, మరికొందరి కాళ్లు పొట్టిగా, మొండం పొడవుగా, చేతులు పొట్టిగా వుండటం వాహనాన్ని నడిపే అంశాలను ప్రభావితం చేస్తుంటాయి. 25 సంవత్సరాలులోపు డ్రైవింగ్‌లో నిష్ణాతులైతే ఖచ్చితమైన డ్రైవర్స్ కాగలుగుతారు. అదే వయస్సు పెరిగేకొద్దీ డ్రైవింగ్ నేర్చుకోగలుగుతారు, నిష్ణాతులు కాలేరు. కన్ను దృష్టి చలనాంగాల సమన్వయంలో ఖచ్చితత్వంలో తేడాలవల్ల ప్రమాదాలు సంభవించవచ్చు.

సెల్‌ఫోన్ వ్యసనం
మద్యం, మత్తు పదార్థాల వరుసలో సెల్‌ఫోన్ వ్యసనం కూడా ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సెల్ మాట్లాడుతూ, సందేశాలు పంపుతూ డ్రైవ్ చేయడంవల్ల ఏకాగ్రత చెదిరి ప్రమాదాలకు కారణం అవుతోంది. 90శాతం వరకు డ్రైవింగ్‌లో ఫోను మాట్లాడేవారు ఏకాగ్రతను రోడ్డుపై ఉంచలేరు. ఎందుకంటే శబ్దాలను వింటూ అవతలి మాటలు వ్యక్తి ఊహాచిత్రాలను విశే్లషించే క్రమంగా బ్రెయిన్ ఏకాగ్రతను దృష్టిని సునాయాసంగా కోల్పోయే ప్రమాదం వుంది.

- అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్