ఐడియా

చేతిరాత మార్చేను తలరాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌కు చెందిన సిమితాపాండ్య అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హ్యాండ్‌రైటింగ్ అనలిస్ట్ సభ్యత్వం సంపాదించిన తొలి భారతీయురాలు. గ్రాఫాలిస్ట్, సైకాలిజిస్ట్‌గా ఆమె ఎంతోమందిని కుంగుబాటు నుంచి బయటకుతెచ్చి కొత్త జీవితాలను ప్రసాదిస్తుంది. గత దశాబ్దకాలంగా ఆమె బాధితులు చేతిరాతిను చూసి వారి జీవితంలో తలెత్తే చీకటి వెలుగులను అంచనావేయగల దిట్ట. సంతకాన్ని చూస్తే చాలు వారిలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ ఆలోచనలను పసిగట్టగలదు. సదాశయంతో ఆమె చేస్తున్న కృషికి అవార్డులు, చెప్పలేనంత పేరును సొంతం చేసుకుంది. సమితాపాండ్యకు ఇటీవలనే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హ్యాండ్‌రైటింగ్ అనలిస్ట్స్ (ఎహెచ్‌ఎఎ)లో సభ్యత్వం రావటం అనేది ఆమె ప్రతిభకు నిదర్శనంగా చెప్పవచ్చు.
మరింత రాణించటానికి దోహదం..
అసోసియేషన్‌లో తొలి భారతీయురాలిగా సభ్యత్వం లభించటం తెలిసి చాలా ఆశ్చర్యచకితురాలైంది. ఎంతోమందికి జీవితం పట్ల అవగాహన కల్పించి వారిని సరైన మార్గంలో నడిపిస్తున్న ఆమె మానవత్వకోణానికి దక్కిన గౌరవంగా భావించింది. ఇది భవిష్యత్తులో గ్రాఫాలజీగా మరింతగా రాణించటానికి ఆమెకు ఎంతగానో దోహదం చేస్తుంది.
రెండుసార్లు ఆత్మహత్యాయత్నం.,,
గ్రాఫాలజీగా కెరీర్‌ను తీర్చిదిద్దుకోవటానికి ముందు ఆమె ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. పెళ్లయిన తరువాత అత్తింటివారు ఆమెను ఉద్యోగం చేసేందుకు బయటకు వెళ్లనీయలేదు. దీంతో ఒంటరిగా ఇంట్లోనే గడపాల్సివచ్చేది. మనసు విప్ప మాట్లాడేందుకు ఎవ్వరూ ఉండేవారు కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆమెలో కలిగిన భావోద్వేగాలు చివరకు ఆమెను కుంగుబాటుకు దారితీశాయి. ఒకవిధంగా జైలు జీవితం అనిపించింది. ఈ సమయంలో భర్త తోడునీడగా ఉండటం ఆమెకు ఒకింత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. అలాగే చురుకునై విద్యార్థి ఇలా కుంగుబాటుకు గురైందనే విషయం తెలుసుకున్న టీచర్లు ఆమెను పిలిపించి మాట్లాడేవారు. వారి సాంత్వన వచనాలు ఆమెలో గూడుకట్టుకున్న దిగులు ప్రారదోలేది. ఈ నేపథ్యంలోనే టీచర్లు ఇచ్చిన సలహాతో సమితాపాండ్య గ్రాఫాలిజీని అధ్యయనం చేయటం జరిగింది. ఆలా తనలో తాను నూతన ఉత్తేజాన్ని నింపుకుంటూ ఈనాడు ఎంతోమందిని కుంగుబాటు నుంచి బయటకు తీసుకువస్తుంది. ముప్పయేళ్ల సమితాపాండ్య నేడు క్షణం తీరిక లేకుండా బాధితులకు సాంత్వన చేకూరుస్తుంది. పిల్లలతో గడిపే సమయం కూడా ఉండటం లేదని, ఇది ఎంతోగానో బాధేస్తుందని ఆమె అంటుంది. ఒక్కొక్కసారి ఈ వృత్తిని వదిలేసి పిల్లలతో గడుపుతూ ఆనందంగా గృహిణిగా స్థిరపడాలని అనిపిస్తుందని చెబుతూ.. ఈ ప్రయాణంలో ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందని, ఈ సందర్భంగా వారి జీవితాలను చదవటం తనకు కొత్త పాఠాలను నేర్పిందని అంటుంది. ఇపుడు క్లినికల్ సైకాలిజిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తున్న సమితాపాండ్య పిల్లలను చూసుకునేందుకు భర్త ఎంతోగానో తోడ్పాటునందిస్తున్నట్లు చెబుతుంది.
గ్రాఫాలిజీ కూడా సైనే్స
దస్తూరి అధ్యయన శాస్త్రం (గ్రాఫాలజీ) అనేది కూడా సైన్స్ వంటిదేనని సమితాపాండ్య నిశ్చితాభిప్రాయం. ఓ వ్యక్తిలో సహజంగా దాగి ఉన్న లక్షణాలను ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు. కేవలం ఆ వ్యక్తి సంతకాన్ని పరిశీలిస్తే చాలు అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. అలాగే అతను రాసిన వంద క్యారక్టర్ల వల్ల అతను నిజాయితీపరుడా? కాదా? స్మార్టా? బద్దకస్తుడా అనే విషయాలను గ్రహించవచ్చని సమితాపాండ్య నిశ్చితాభిప్రాయం.
పేపర్‌తో అవసరం లేకుండా అంతా అన్‌లైన్ వ్యవహారం సాగుతున్న ఈ రోజుల్లో గ్రాఫాలజిస్ట్‌గా రాణించటం సవాల్‌తో కూడుకున్నదంటునే ఈ పరిస్థితులను కూడా సానుకూలంగా మలుచుకునేందుకు ఆమె సిద్ధమవుతుంది.