డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అమ్మాయి అందుకే సందేహిస్తోందనిపించింది. చివరకు నేనే కారు ఎక్కి ఆ అమ్మాయి కారుకు ముందుగా షోల్డర్ మీదకు నా కారు కూడా పోనిద్దామని సిగ్నల్ వేసి పక్కకు పోనివ్వపోయాను. అది చాలా రిస్కీ అని నాకు తెలుసు. ఒకసారి కారు స్నోలో ఇరుక్కుంటే బయటకు లాగటం కష్టం. నా సైడ్ మిర్రర్‌లో ఆ అమ్మాయి కారు దిగినట్లు కనిపించింది. చెయ్యి ఎత్తింది ఆగమని సూచిస్తూ!
నేను ఆగిపోయాను. తను కార్లోకి వంగి తన హ్యాండ్ బ్యాగ్, బుక్స్ బ్యాగ్ అన్నీ తీసుకుని గబగబా నా కారులోకి ఎక్కింది. ఆ కాస్తకే ఆ అమ్మాయి జుట్టంతా, కోటునిండా స్నో పడిపోయింది.
స్నో దులుపుకుంటూ ‘్థంక్స్’ అంది.
‘‘మీరు డ్రైవ్ చేస్తారా?’’ అని అడిగాను.
‘‘నో నో! మీరు చేయండి’’. అప్పటికే ఆ అమ్మాయి చల్లటి కార్లో చాలాసేపటినుంచి కూచుంది. బాగా చలికి ఎక్స్‌పోజ్ అయింది. ముక్కు, చెక్కిళ్ళు గులాబి రంగులోకి మారిపోయాయి.
గ్లోవ్స్ తొడుక్కుని ఉన్న చేతినే ముందుకు చాచుతూ ‘‘నా పేరు వౌళి. యు ఆఫ్ ఎమ్‌లో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అన్నాను. మా సంభాషణ అంతా ఇంగ్లీషులోనే సాగుతోంది.
ఆ అమ్మాయి నా చేతిలో చెయ్యి ఉంచుతూ- ‘‘ఐ యామ్ తేజస్విని! ఎంఎస్‌యులో అండర్ గ్రాడ్యుయేట్ చేస్తున్నాను’’.
‘‘వాట్ ఏ ప్రెటీ నేమ్. నేనిదే మోదటిసారి వినడం’’ అన్నాను.
ముందున్న విండ్‌షీల్డ్ మీద నిలిచిపోయిన స్నో దులుపుతూ ‘‘ఏం స్నో’’ మెల్లిగా నాలో నేను అనుకున్నాను.
‘‘మీరు తెలుగు?’’ అంది.
తల ఊపాను.
‘‘మా తల్లిదండ్రులు కూడా! నాకు బాగా అర్థం అవుతుంది’’ అంది.
కారు చాలా మెల్లిగా వెడుతోంది. తన బుక్స్ బాగ్‌లోంచి ఒక లంచ్ బాగ్ తీసింది. తను సరాసరి కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరినట్లుంది. తనతోపాటు కంప్యూటర్, బుక్స్ అన్నీ ఉన్నాయి.
లంచ్ బాగ్‌లో ఒక శాండ్‌విచ్ తీసి ఒక సగం నాకివ్వబోయింది.
నో.. నేను ఇందాకనే ఒక పార్టీ నుంచి వస్తున్నాను. చూడబోతే మీరు డిన్నర్ చేసినట్లు లేదు. మీరు తినేయండి’’ అంటూ వెనక సీట్‌లోంచి చిప్స్, కోక్ తీసి ఇచ్చాను.
‘‘ఏం కోర్సులు తీసుకుంటున్నారు?’’ అడిగాను ఏదో మాట్లాడటానికి కాలక్షేపానికి.
‘‘స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్’’.. చాలా లిస్టు చదివింది.
నవ్వుతూ అడిగాను- ‘‘స్టాటిస్టిక్స్ ఎలా ఉంది?’’
‘‘ఓ గాడ్! డోంట్ ఆస్క్’’ అంది నుదుట చేయి ఉంచుకుంటూ.
‘‘ఆ సబ్జెక్టు అర్థమయితే చాలా సులువు అనిపిస్తుంది. లేకపోతే అంతకంటే కన్‌ఫ్యూజింగ్ సబ్జెక్టు మరొకటి ఉండదు’’ అన్నాను.
తల ఊపుతూ అంగీకరించింది.
‘‘ఇండియానుంచి వచ్చిన నేను, అమెరికాలో పెరిగిన మీరు, ఇద్దరు తెలుగువాళ్ళు ఒక కారులో ఇలాంటి వాతావరణంలో ప్రయాణించడానికి ఎంత ప్రాబబలిటీ ఉంటుందంటారు?’’ ఇదో స్టాటిస్టికల్ ప్రశ్న.
నవ్వింది. కొంచెం రిలాక్స్ అయినట్లు కనిపించింది.
రాను రాను రోడ్లు మరీ దారుణం అయిపోతున్నట్లుగా ఉన్నాయి. ఒక్క పది మైళ్ళు వెళ్ళడానికి గంటన్నర దాటిపోయింది. అసలు కారు డ్రైవ్ చేయడానికి సాధ్యపడటంలేదు. కేవలం కారు పాకుతున్నట్లుగా వెడుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయిన కార్లు కనిపిస్తున్నాయి.
ఆ అమ్మాయి వీకెండ్ ఇంటికి వెడుతోంది. స్కూల్‌వర్క్ పూర్తిచేసుకుని బయలుదేరుదామని లైబ్రరీలో ఉండిపోయిందట. బయట ఏం జరుగుతోందో పెద్దగా గమనించలేదు. అంత స్నో పడుతుందనుకుంటే అసలు బయలుదేరేదాన్ని కాదు అంది.
‘‘ఇంక రోడ్లు మరీ మూసుకుపోతున్నాయి. రాబోయే ఎగ్జిట్ తీసేసుకోండి. ఇంక కార్‌లో సేఫ్ కాదు అంటూ తొందర పెట్టడం మొదలుపెట్టింది. ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వంక చూశాను. కార్లో ఎక్కడానికే సందేహించిన అమ్మాయేనా అనుకున్నాను.
కొద్దిసేపటిలోనే ఎగ్జిట్ వచ్చింది. అందులోని పోనిచ్చాను. అదృష్టవశాత్తు ఒక మోటల్ ఉంది. కారు దిగి ఇద్దరం గబగబా లాబీలోకి వెళ్లాం.
ఆ హోటల్ మేనేజర్ ఒక భారతీయుడే. నన్ను చూడగానే చిరునవ్వు నవ్వాడు. వెంటనే హిందీలో ‘రూమ్స్ ఖాళీ లేవు భయ్యా’ అన్నాడు.
‘‘్ఫర్వాలేదు. ఈ లాబీలోనే వెయిట్ చేస్తాం. రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి’’ అన్నాను హిందీలో.
‘‘కోయ్ బాత్ నయ్’’ అన్నాడు.
ప్రశ్నార్థకంగా చూచింది తేజస్విని. ఇంగ్లీష్‌లో చెప్పాను.
‘‘్థంక్ గాడ్ అంది. వద్దంటాడని భయపడ్డాను’’ అంది.
‘‘ఈ వాతావరణంలో ఎవ్వరూ అనరు, అందులో భారతీయుడు’’ అన్నాను.
కారు ఎక్కినప్పటినుంచి ఫోన్ చెయ్యాలని ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఫోన్ కలవడంలేదు. నెట్‌వర్క్ సరిగా లేకో- వాతావరణం మూలంగానో.
‘‘ఒక్కసారి మీ ఫోన్ ఉపయోగించుకోవచ్చా’’ అని అడిగాను హోటల్ అతన్ని.
మాట్లాడకుండా ఫోన్ ముందుకు జరిపాడు. తేజ నా వంకే చూస్తోంది. రిసీవర్ చేత్తో పట్టుకుని కళ్ళతోనే సౌంజ్ఞ చేసి ఫోన్ చూపించాను.
గబా గబా వచ్చి ఫోన్ తీసుకుంది. వెంటనే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది.
‘‘మామ్, ఈ రాత్రి ఇంటికి రావడంలేదు. విపరీతంగా స్నో పడుతోంది. నా కారు వదిలేసి మరొకరితో మోటల్‌కి వచ్చాను. నేను బాగానే ఉన్నాను. వర్రీ అవ్వకు. ఇక్కడ చాలామంది ఆగిపోతున్నారు. యానార్బర్ వెళ్ళే ఒక అతను నాకు లిఫ్ట్ ఇచ్చాడు. డోంట్ వర్రీ. హీ ఈజ్ గుడ్ డ్రైవర్. రేపు బయలుదేరే ముందు మళ్లీ ఫోన్ చేస్తాను’’ అంటూ ఫోన్ పెట్టేసింది.
ఆశ్చర్యంగా చూశాను. ఇందాకా కారులో ఎక్కడానికి సందేహించిన అమ్మాయి ఇప్పుడు గుడ్ డ్రైవర్ అని చెప్తోంది.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి